వరల్డ్ కప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులను కంగారు పెట్టే పిడుగులాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. టీమిండియాకు వరస విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ.. కీలకమైన సెమీ ఫైనల్‌కు ముందు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా టాపార్డర్‌లో ఎంతో కీ ప్లేయర్‌గా ఉన్న కోహ్లీ గాయంతో సెమీస్ ఆడకపోతే వరల్డ్ కప్‌పై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు. పాకిస్థాన్‌తో ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన కోహ్లీ జట్టులో లేకుంటే.. ఇంగ్లండ్ జట్టుకు వంద ఏనుగుల బలం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రోహిత్ శర్మ చేతికి గాయమంటూ ఆందోళన చెందిన ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ నెట్స్‌లో గాయపడటంతో మరింత కంగారు పడుతున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో కీలక సెమీస్‌కి ముందు టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి కోహ్లీకి బలంగా తాకింది. దీంతో కోహ్లీ వెంటనే అక్కడే కూర్చుండిపోయాడు. హర్షల్ పటేల్ సైతం కోహ్లీ దగ్గరికి వచ్చి.. ఏమైందో తెలుసుకున్నాడు. కానీ.. వెంటనే దెబ్బ నుంచి కోలుకున్న కోహ్లీ.. తిరిగి బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం అయింది. సెమీస్ మ్యాచ్‌కు దూరం అయ్యేంత పెద్ద గాయం ఏమీ కాలేదని విశ్వసనీయ సమాచారం.
Scary moment for Virat Kohli, Harshal Patel ball hit him in the nets. pic.twitter.com/iIUyit9XgL
— Aru★ (@Aru_Ro45) November 9, 2022