భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం తెలిసిందే. క్రికెట్ విషయంలో కాస్త చనువుగా ఉన్నా.. కొన్ని సున్నితమైన, గౌరవప్రదమైన విషయాల్లో మాత్రం కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. సరిగ్గా ఇదే విషయంలోనే పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ తప్పు చేశాడు. భారత అభిమానులు అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటే.. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఒక పెద్ద తప్పు చేశాడు. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినా.. కనీసం ఈ విషయం కూడా తెలియదా? అంటూ మండిపడుతున్నారు. భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న అఫ్రిదీ ఏం చేశాడంటే.. భారత జాతీయ పతాకంపై ఆటోగ్రఫ్ ఇచ్చాడు.
ఏ దేశపు జెండాకైనా ఒక కోడ్ ఉంటుంది. జాతీయ జెండా విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి. ఎలా గౌరవించాలి అనేవి స్పష్టంగా ఉంటాయి. దాదాపు అన్ని దేశాల జాతీయ జెండా కోడ్‌లో కొన్ని విషయాలు కామన్‌గా ఉంటాయి. పైగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉండే వ్యక్తులకు ఈ విషయాలపై కనీసం అవగాహన ఉండాలి. ఒక వేళ అవగాహన లేకుంటే.. వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. కానీ.. పాకిస్థాన్ క్రికెటర్ షాహీన్ షా అఫ్రిదీ కొంత అత్యుత్సాహం చూపించాడు. భారత క్రికెట్ అభిమానులు అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటే.. ఏకంగా భారత జాతీయ పతాకంపైనే సంతకం చేశాడు. ఈ విషయం తీవ్ర దుమారంగా మారింది. ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ పతాకంపై ఎలాంటి రాతలు రాయకుడదు. అలాంటి అఫ్రిదీ ఏకంగా ఆటోగ్రాఫ్ చేయడం వివాదానికి తెరతీసింది.
భారత జాతీయ ప్రతిష్టకు అవమాన నిరోధకచట్టం-1971, భారత పతాకస్మృతి -2002కు లోడడి.. జాతీయ జెండాను గౌరవించాల్సి ఉంటుంది. అలాగే ఫ్లాగ్ కోడ్ 2022 రూల్స్ పాటించడం తప్పనిసరి. ఈ చట్టాలు, రూల్స్ అఫ్రిదీకి తెలియకపోయినా.. ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సున్నితమైన విషయాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. కానీ.. అఫ్రిదీ తెలిసి చేసినా.. తెలియక చేసినా.. అతను చేసింది తప్పే. దీనికిపై అతను కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాలని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. అఫ్రిదీ చేతుల్లో జాతీయ జెండా పెట్టి ఆటోగ్రాఫ్ అడిగిన భారత అభిమానికైనా బుద్ధి లేదా అంటూ మరి కొంతమంది మండిపడుతున్నారు.
Shaheen Afridi signed an Indian flag for a fan 🏏#crickettwitter #india #pakistan #t20worldcup pic.twitter.com/Dhcn3rR2rP
— Sportskeeda (@Sportskeeda) November 8, 2022