ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు సెమీ ఫైనల్స్ పూర్తి చేసుకుని.. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జరగనుంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్, రెండో సెమీ పైనల్‌లో భారత్ పై విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్ ఈ తుది పోరులో తలపడనున్నాయి. 2007 నుంచి జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు వెస్టిండిస్ జట్టు మాత్రమే రెండుసార్లు వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఫైనల్ లో ఏ జట్టు విజయం సాధించినా కూడా.. రెండుసార్లు టైటిల్ కొట్టిన జట్టుగా విండీస్ సరసన చేరుతాయి. అయితే ఫైనల్ జరిగే దాఖలాలు అయితే కనిపించడం లేదు.
అవును.. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే అక్కడ వాతావరణం అందరినీ కలవరపెడుతోంది. మెల్‌బోర్న్ సిటీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. స్టేడియం వద్ద కూడా ఆదివారం 95 శాతం మేర వర్షంపడే సూచనలు ఉన్నాయి. రిజర్వ్ డే అయిన సోమవారం కూడా మెల్‌బోర్న్ లో 80శాతం వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాంటప్పుడు మరి ఏంచేస్తారు అని చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే రిజర్వు డే రోజు కూడా ఇన్నింగ్స్ కి 10 ఓవర్లు కూడా ఆడే అవకాశం లేనప్పుడు సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు. అంటే అప్పుడు పాకిస్తాన్- ఇంగ్లాండ్ ఇద్దరూ కప్ విజేతలు అవుతారు. అంటే అప్పుడు కప్‌ని రెండుసార్లు గెలిచిన జట్లుగా వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు మూడూ నిలుస్తాయి.
Forecast for the T20 cricket World Cup in Melbourne still doesn’t look ideal with showers on Sunday and even on the reserve day on Monday ☔️
‘Every effort’ will be made to complete the final around any rain with organisers changing playing regulations.https://t.co/8dmRoXD6ic pic.twitter.com/RnI9PnHTwK
— BBC Weather (@bbcweather) November 11, 2022
Wet weather is forecast for Sunday’s T20 World Cup final in Melbourne.
Le Pakistani fans: #T20WorldCupFinal #PAKvENG pic.twitter.com/LduolUg8Zu— Cricerz (@cricerz) November 11, 2022