దాయాదుల పోరులో టీమిండియా తడపడినట్లు కనిపిస్తోంది. వరసుగా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. బౌలింగ్‌లో ఎంతో అద్భుతంగా రాణించిన జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం బాగా తడబడుతోంది. ఔటైన నలుగురు కలిసి కొట్టింది కేవలం 25 పరుగులు మాత్రమే. పది ఓవర్లలో కేవలం 45 పరుగులు స్కోర్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు. సూర్యకుమార్ యాదవ్ వికెట్ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి విరాట్ కోహ్లీ వికెట్ ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, విరాట్ వల్లే అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
అంతేకాకుండా ఇప్పుడు అక్షర్ పటేల్ రనౌట్ విషయంలో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అక్షర్ పటేల్‌ది రనౌట్ కాదని వాదిస్తున్నారు. టీవీ అంపైర్ చాలాసేపు, వివిధ ఫ్రేమ్స్ చెక్‌చేసి రనౌట్ ప్రకటించినప్పటికీ.. అదిమాత్రం నాటౌట్ అని వాదిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియో చూస్తే.. అది రనౌట్ అని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మహ్మద్ రిజ్వాన్ స్టంపింగ్ చేస్తున్న సమయంలో అతని చేతిలో బంతి లేదు. కేవలం గ్లౌజ్‌లతో మాత్రమే వికెట్లను నెట్టేసినట్లు కనిపించింది. కొందరైతే రనౌట్ నిర్ణయంపై చాలా అనుమానాలు ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. రనౌట్‌పై కూడా మళ్లీ రివ్యూ తీసుకునేలా రూల్స్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Thoughts on Axar Patel run out?
I don’t think the ball is touching stumps as bails are dislodged. Middle stump is the only one in question as ball never touches other stumps. #INDvPAK pic.twitter.com/P2fwuxuA9H— Brad Hogg (@Brad_Hogg) October 23, 2022
A massive moment in the game! Axar Patel is run out!#PAKvsIND | #T20WorldCup pic.twitter.com/gdmt2W1TFm
— Grassroots Cricket (@grassrootscric) October 23, 2022
Thoughts? Out or not-out?#AxarPatel @RevSportz #INDvPAK #T20WorldCup pic.twitter.com/5rRKbdf6r0
— Subhayan Chakraborty (@CricSubhayan) October 23, 2022