ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వరుణుడు విలన్ గా మారుతున్నాడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కాగా, టోర్నీలో మొత్తం రద్దయిన మ్యాచుల సంఖ్య 4కు చేరింది. ఇదిలావుంటే.. శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మ్యాచ్‌ల రద్దు వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా హస్తమున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అందుకు తగ్గ సాక్షాధారాలను ఉటంకిస్తూ ట్వీట్ చేశాడు.
మైకేల్ వాన్ చెప్పినట్లుగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కు రూఫ్ సౌకర్యం ఉంది. అంటే.. వర్షం పడే సమయంలో మైదానం తడవకుండా రూఫ్ తో కప్పి ఉంచవచ్చు. ఈ విధంగా చేస్తే పిచ్ తడవకుండా ఉంటుంది. వర్షం ఆగిన తరువాత మ్యాచును యధాతధంగా కొనసాగించవచ్చు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా అలా చేయలేదు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. దీన్ని ప్రశ్నిస్తూ వాన్ ట్వీట్ చేశాడు. “శ్రీలంక వంటి చిన్న దేశాల్లో కూడా పెద్ద పెద్ద వర్షాల పడినా వెంటనే మైదానాలను మ్యాచ్‌లకు సిద్దం చేశారని, కానీ అధునాతన సౌకర్యాలు ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను మాత్రం సిద్దం చేయలేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నా.. గ్రౌండ్ ను రూఫ్‌తో ఎందుకు కప్పి ఉంచలేదని ప్రశ్నించాడు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుందని..” వాన్ పేర్కొన్నాడు.
Rainy season in Australia .. Stadium in Melbourne with roof on .. !!!!! Wouldn’t it have been sensible to use it ??? #JustSaying #ICCT20WorldCup2022
— Michael Vaughan (@MichaelVaughan) October 28, 2022
Can I also ask why in Sri Lanka where they get huge thunder storms they cover all the ground & get play back on quickly … Why hasn’t the MCG been totally covered for the last 2 days ????? #JustAsking #ICCT20WorldCup2022
— Michael Vaughan (@MichaelVaughan) October 28, 2022
కాగా, ఈ మ్యాచ్ రద్దవ్వడంతో ఆస్ట్రేలియా తిరిగి రేసులోకొచ్చింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన ఆసీస్.. న్యూజిలాండ్ తో ఓడి, శ్రీలంకపై గెలిచింది, ఇంగ్లాండ్ తో మ్యాచ్ రద్దైంది. ఫలితంగా 3 పాయింట్లతో గ్రూప్ – 1లో నాలుగో స్థానంలో నిలిచింది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆసీస్ పసికూన జట్లయిన ఐర్లాండ్, అఫ్గాన్‌లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే ఆసీస్‌కు తిరుగుండదు. ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే.. తొలి మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించినా, రెండో మ్యాచులో ఐర్లాండ్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్ ఆసీస్ తో రద్దైంది. ఫలితంగా 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ తదుపరి మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడాల్సివుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే సెమీస్ అవకాశాలు కొట్టిపారేయలేం. అంతేకాదు.. నెట్ రన్ రేట్ (+0.239) కాస్త మెరుగ్గా ఉండటం ఇంగ్లాండ్ కు లాభించేదే.
Here’s how the #T20WorldCup Group 1 standings look after a full day that was rained off in Melbourne 🌧
Who do you think are now the favourites for the top 2 spots? 👀
Check out 👉 https://t.co/phnXR5PYyu pic.twitter.com/wH4Ss3lRFM
— ICC (@ICC) October 28, 2022
ప్రస్తుతం గ్రూప్ -1లో న్యూజిలాండ్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో విజయం సాధించడంతో పాటు రద్దయిన మ్యాచ్‌ల కారణంగా మరో పాయింట్ సాధించాయి. రెండు పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్ రెండు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ఆఖరి స్థానంలో ఉంది. ఇక్కడ, ఐర్లాండ్, శ్రీలంక జట్లకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ -1 నుంచి సెమీస్ చేరే జట్లు ఏవన్నది వరుణ దేవుడు మీదనే ఆధారపడి ఉంది. ఇక, గ్రూప్-2లో సెమీస్ చేరే అవకాశాలు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు మెండుగా ఉన్నాయి.
Group 1 qualification probability (after the double abandonment)
🇳🇿 61% (+6%)
🇦🇺 43% (-1%)
🏴 37% (-4%)
🇱🇰 34% (-2%)
🇦🇫 14% (+4%)
🍀 12% (-3%)#T20WorldCup— Freddie Wilde (@fwildecricket) October 28, 2022