ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా- బంగ్లాదేశ్ పోరు రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీమిండియాని కట్టడి చేయడంలో కాస్త పట్టు తప్పినట్లే కనిపించింది. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓవర్‌కు పది పరుగులు చేసుకుంటూ వచ్చింది. టీమిండియా బౌలర్లను బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ పరుగులు పెట్టించాడు. ఏ బౌలర్ వచ్చిన మైదానం మొత్తం షాట్లు కొడుతూ స్కోర్ కార్డుని పరుగులు పెట్టించాడు. సిక్సర్‌తో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అప్పటికి టీమ్ స్కోర్ 54 పరుగులు కాగా.. 51 పరుగులు లిటన్ దాస్‌వే కావడం విశేషం.
లిటన్ దాస్ మ్యాచ్ ప్రారంభం నుంచి విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఆరో ఓవర్‌లో తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్సర్ కొట్టి తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 7 ఓవర్ల తర్వాత మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి వికెట్ కోల్పోకుండా బంగ్లాదేశ్ 66 పరుగులు చేసింది. వాటిలో లిటన్ దాస్ 59 పరుగులతో అజేయంగా ఉన్నాడు.3 సిక్సర్లు, 7 ఫోర్లతో మైదానంలో వీరవిహారం చేశాడు. ఇంక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్(50), సూర్య కుమార్ యాదవ్(30), హార్దిక్ పాండ్యా(5), దినేశ్ కార్తీక్(7) ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. విరాట్ కోహ్లీ 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్విన్ కూడా సిక్సర్, ఫోర్ సాయంతో 6 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
Litton Das brings up his fifty off just 21 balls! 🤯#T20WorldCup | #INDvBAN | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/sPM4wU5vch
— ICC (@ICC) November 2, 2022
A 21 ball half century for Litton Das. A scintillating innings so far – the 2nd fastest of the World Cup behind only Marcus Stoinis. A treat to watch 🔥 #INDVsBNG pic.twitter.com/es9MJQzt7S
— Aatif Nawaz (@AatifNawaz) November 2, 2022
#TeamIndia
Liton Das on fire 🔥🔥 pic.twitter.com/lrRtw1BQaT— ABBAS KHAN ADILL (@76z80) November 2, 2022
Second fastest fifty of this T20 World Cup from Litton Das.
📸: Disney+Hotstar#CricTracker #LittonDas #INDvBAN #T20WorldCup pic.twitter.com/dQATV97Cnc
— CricTracker (@Cricketracker) November 2, 2022