ఏ ఆటైనా సరే ప్రతి జట్టు కూడా గెలవాలనే చూస్తారు. కాకపోతే అన్నిరోజులు మనవి కావు. కొన్నిసార్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక క్రికెట్ మ్యాచ్ గెలిచే విషయంలో ఎంతకైనా తెగించేందుకు ఆటగాళ్లు రెడీగా ఉంటారు. చివరి ఓవర్ వస్తే.. కొన్నిసార్లు డిఫరెంట్ స్ట్రాటజీలు అమలు చేస్తారు. అప్పుడప్పుడు అవి వర్కౌటైతే… కొన్నిసార్లు ఫెయిలవుతుంటాయి. ఇప్పుడు భారత్-బంగ్లా మ్యాచ్ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. భారత్-బంగ్లా మ్యాచ్ చూస్తే థ్రిల్లర్ సినిమా అంతా కిక్ వస్తుంది! ఎందుకంటే భారత్ 184/6 స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 7 ఓవర్లకు బంగ్లా జట్టు 66/0 ఉన్న దశలో వర్షం పడింది. ఆ తర్వాత మ్యాచ్ ని 16 ఓవర్లకు కుదించారు. 54 బంతుల్లో 85 పరుగులు టార్గెట్ గా ఫిక్స్ చేశారు. వర్షం పడకముందు బాగానే ఆడిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తడబడింది. నిర్దేశించిన మిగతా 9 ఓవర్లలో 79 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
ఇక చివరి ఓవర్ గురించి ప్రస్తావన వస్తే.. 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇక క్రీజులో ఉన్న బంగ్లా బ్యాటర్ నురల్ హసన్.. పూర్తిగా క్రీజు లోపలికి వచ్చేశాడు. ఎందుకంటే బౌలర్ అర్షదీప్ సాధారణంగా యార్కర్లు వేస్తాడు. ఇక గెలవాల్సిన స్థితిలో ప్రతి బంతి కూడా అలానే వేసే ఛాన్సులు చాలా ఎక్కువ. ఈ కారణంతోనే నురల్.. చివరి బంతికి 7 పరుగులు అవసరమైన స్థితిలో క్రీజు లోపలికి వచ్చి బ్యాటింగ్ చేశాడు. కానీ అర్షదీప్ ప్లాన్ ముందు మనోడు తేలిపోయాడు. దీంతో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత దీనినే ప్రస్తావించిన పలువురు నెటిజన్స్.. బంగ్లా స్ట్రాటజీ ప్లే చేసినా సరే గెలవలేకపోయిందని మాట్లాడుకుంటున్నారు.
An incredible win for Team India! 🤯🤯🤯
What was the turning point in that 5-run (DLS) win?#BelieveInBlue #ViratKohli #KLRahul #INDvsBAN #INDvBAN | ICC Men’s #T20WorldCup 2022 pic.twitter.com/iiVXaGabce
— Star Sports (@StarSportsIndia) November 2, 2022