ముంబయి ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పంజాబ్ ని తుక్కురేగ్గొట్టి తాజా మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. చెప్పాలంటే తిలక్ వర్మ.. అర్షదీప్ రివేంజ్ మొత్తం తీర్చుకున్నాడు.
ఐపీఎల్ ఇప్పటివరకు ఓ లెక్క, ఈవారం జరుగుతున్న మ్యాచులన్నీ మరో లెక్క. ఎందుకంటే ఇవి గెలుపుకోసం ఆడుతున్నట్లు లేదు. రివేంజ్ తీర్చుకోవడం ఆడుతున్నట్లు ఉంది. మీరు విన్నది కరెక్టే. మొన్న లక్నోపై ఆర్సీబీ.. అంతకు అంతకు పగ తీర్చుకుంది. కోహ్లీ-గంభీర్ గొడవ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముంబయి కూడా పంజాబ్ అలానే రివేంజ్ తీర్చుకుంది. ఈ సీజన్ లో జరిగిన గత మ్యాచ్ పంజాబ్ ని ఓడించలేకపోయింది గానీ ఈసారి మాత్రం తుక్కురేగ్గొట్టింది. చెప్పాలంటే గత మ్యాచ్ హీరో అర్షదీప్.. ఈసారి అడ్డంగా బలైపోయాడు. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ఏప్రిల్ 22న ముంబయి-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్. 215 టార్గెట్ ని రోహిత్ సేన ఛేదించలేకపోయింది. ఇదే మ్యాచ్ లో అర్షదీప్ చెలరేగి బౌలింగ్ చేశాడు. మిడిల్ స్టంప్ ని ఏకంగా రెండుసార్లు విరగ్గొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. అప్పుడు ముంబయిలో మ్యాచ్ జరిగింది. కట్ చేస్తే తాజాగా పంజాబ్ సొంతగడ్డపై ఆ జట్టుని ముంబయి ఓడించింది. బ్యాటర్లు అదరగొట్టేశారు. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ యాదవ్ 66, తిలక్ వర్మ 26 విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే తిలక్ వర్మ, అర్షదీప్ పై అదిరిపోయే రేంజులో పగ తీర్చుకోవడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం.
భారత తరఫున పరిమిత ఓవర్లలో ఆకట్టుకున్న అర్షదీప్.. ఈసారి ఐపీఎల్ లోనూ అలానే బౌలింగ్ చేస్తున్నాడు. తాజాగా ముంబయితో మ్యాచ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. 3.5 ఓవర్లలో ఏకంగా 66 పరుగులిచ్చేశాడు. గత మ్యాచ్ లో హీరో కాస్త ఇప్పుడు జీరో అయ్యాడు. ఇదంతా ఓ ఎత్తయితే గత మ్యాచ్ లో తిలక్ వర్మని అర్షదీప్ బౌల్డ్ చేసి వికెట్ ఇరగ్గొట్టాడు. ఇప్పుడు అదే అర్షదీప్ ఓవర్ లో వరసగా 6,4,6 కొట్టి తెలుగోడి రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుందో రియాలిటీలో చూపించాడు. ప్రస్తుతం ఇదే విషయం ఫ్యాన్స్ మధ్య పెద్ద డిస్కషన్ కి కారణమైంది. మరి మన తెలుగోడు తిలక్ వర్మ చేతిలో అర్షదీప్ బలైపోవడం గురించి మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
IPL 2023:
Arshdeep Singh broke Tilak Varma’s middle stump in the first match.
Tilak Varma smacked 6,4,6 against Arshdeep in the 2nd match. pic.twitter.com/sFkDUYsYTH
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023