వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటలో ఉన్న టీమిండియా టెస్టు సిరీస్ ని ఘనంగా ముగించుకొని వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బార్బడోస్ వేదికగా నేడు తొలి వన్డే జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దూరదర్శన్, జియో సినిమాలో ఈ మ్యాచ్ ని ప్రసారం కానుంది. మరి కొన్ని నెలలో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. గత కొంతకాలంగా వన్డే క్రికెట్ కి రెస్ట్ తీసుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులోకి బరిలోకి దిగనున్నారు. విండీస్ జట్టు బలహీనంగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఏ జట్టైనా గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలవాలంటే టీమిండియా స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాల్సిందే. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొత్తం వన్డే సిరీస్ కి దూరం కానున్నాడు.
ప్రస్తుతం బూమ్రా గాయపడడంతో టీమిండియా పేస్ బాధ్యతలను సిరాజ్ మోస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా సిరాజ్ టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడు అయిపోయాడు. ఈ క్రమంలో తీరిక లేకుండా మ్యాచులు ఆడుతుండడంతో బీసీసీఐ ఈ స్టార్ బౌలర్ కి రెస్ట్ ఇవ్వాలని భావించినట్లుగా సమాచారం. ఆసియా కప్, వన్డే వరల్డ్ ఉండడంతో సిరాజ్ మీద వర్క్ లోడ్ తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. దీంతో సిరాజ్ అశ్విన్, రహానేతో , భరత్ తో కలిసి స్వదేశానికి బయలుదేరుతున్నట్లుగా సమాచారం. సిరాజ్ ఈ వన్డే సిరీస్ కి దూరమునైన నేపథ్యంలో యార్కర్ల వీరుడు అర్షదీప్ కి ఈ సిరీస్ లో అవకాశం దక్కొచ్చు.
గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్ లో సత్తా చూపిస్తూ సిరాజ్ టీమిండియా స్టార్ బౌలర్ గా ఎదిగాడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో పేస్ బౌలర్లకు పిచ్ అంతగా అనుకూలించకపోయినా సిరాజ్ అదరగొట్టేసాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 5 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టీ 20జట్టుకలో సభ్యుడిగా ఉన్న అర్షదీప్ సింగ్ వైపు కోచ్ రాహుల్ ద్రావిడ్ సిరాజ్ ప్లేస్ లో ఎంపిక చేయాల్సిందిగా భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవలే టెస్టు జట్టులో స్థానం సంపాదించిన ముకేశ్ కుమార్ కి తొలి వన్డేలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. మరో పేసర్ గా ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉంటాడు. మరి బీసీసీఐ సిరాజ్ కి రెస్ట్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.