ఐపీఎల్ లో నిన్న పంజాబ్ ప్లేయర్ మీద అభిమానులు చూపించిన సపోర్ట్ హైలెట్ గా నిలిచింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. వారందరు అమ్మాయిలు కావడం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిదాటికి స్టేడియం మొత్తం నిండిపోతుంది. ధోని, కోహ్లీ, రోహిత్ ఈ లిస్టులో ప్రధమ వరుసలో ఉంటారు. ఇదే చివరి ఐపీఎల్ అని అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో ధోని ఎక్కడికి వెళ్తే అభిమానులు అక్కడ వాలిపోతున్నారు. ఇక కోహ్లీ వస్తే బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియం, రోహిత్ వస్తే ముంబై స్టేడియంలో అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే ఇప్పుడు ఇండియన్ పేసర్ అర్షదీప్ సింగ్ మీద అభిమానం విషయంలో ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంతకీ ఆ స్పెషాలిటీ ఏంటీ ?
ఐపీఎల్ లో నిన్న మొహాలీ వేదికగా లక్నో సూపర్ జయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచులో లక్నో 56 పరుగుల తేడాతో ధావన్ అండ్ కో ని ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మేయర్స్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మిగిలిన వారు కూడా బ్యాట్ కి పని చెప్పారు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 201 పరుగులకే పరిమితమైంది. అథర్వ తైదే అర్ధ సెంచరీతో రాణించిన ఎవరూ కూడా అతనికి సహకరించలేదు. దీంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు.
భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో అర్షదీప్ సింగ్ ఒక విషయంలో హైలెట్ గా నిలిచాడు . ఈ లెఫ్ట్ హ్యాండర్ పేసర్ కోసం అమ్మాయిలు తరలి వచ్చారు. ఇందులో ఆశ్చర్యం లేకపోయినా.. 10 మంది అమ్మాయిలు వారి టీ షర్ట్ ల మీద అర్షదీప్ సింగ్ పేరుని ఒక్కో అక్షరంగా రాసుకొని వచ్చారు. “arshdeep” మొత్తం 8 అక్షరాలూ కాగా మరో ఇద్దరు అమ్మాయిలు ఒకరి టీ షర్ట్ మీద “we” అని మరో అమ్మాయి తన టీ షర్ట్ మీద “లవ్” సింబల్ చూపిస్తూ అర్షదీప్ కి సపోర్ట్ చేస్తూ కనిపించారు. మ్యాచ్ ప్రారంభంలో ఇదే ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఇక ఈ మ్యాచులో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అర్షదీప్ కోసం అమ్మాయిలు ఇలా వరుసగా నిలబడి సపోర్ట్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.