SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Indian Womens Lost Against Bangladesh In 3rd Odi

Indian Cricket : బంగ్లాపై గెలవాల్సిన మ్యాచ్ భారత మహిళలు తడబాటు!

అదేంటి భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు మ్యాచ్‌ ఆడుతుంటే.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ‘టై’ కావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? రోహిత్‌ సారథ్యంలోని పురుషుల జట్టు కరీబియన్‌ దీవుల్లో దుమ్మురేపుతుంటే.. మహిళల జట్టు బంగ్లాదేశతో వన్డే సిరీస్‌ ఆడుతోంది.

  • Written By: Raja Sekhar
  • Published Date - Sat - 22 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Indian Cricket : బంగ్లాపై గెలవాల్సిన మ్యాచ్ భారత మహిళలు తడబాటు!

స్వల్ప లక్ష్యఛేదనలో లోయర్‌ ఆర్డర్‌ తడబడటంతో భారత జట్టు వన్డే సిరీస్‌ పంచుకుంది. బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ‘టై’ చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా నిలువగా.. ఆఖరి పోరు ‘టై’గా ముగియడంతో సిరీస్‌ను ఇరు జట్లు పంచుకున్నాయి. రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానా హక్‌ (107) సెంచరీతో చెలరేగగా.. షమీమా సుల్తానా (52) అర్ధశతకంతో రాణించింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 49.3 ఓవర్లలో సరిగ్గా 225 పరుగులే చేసి ఆలౌటైంది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

లక్ష్యఛేదనలో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధన (59), హర్లీన్‌ డియోల్‌ (77) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలిచేలా కనిపించింది. ఒక దశలో 191/4తో పట్టి స్థితిలో నిలిచిన భారత్‌.. విజయం ఖాయమే అనుకుంటున్న దశలో బంగ్లా బౌలర్లు గొప్పగా పోరాడారు వరుస విరామాల్లో వికెట్లు తీసి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు. యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ (4), యష్తిక భాటియా (5), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14), దీప్తి శర్మ (1) విఫలమయ్యారు. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 14 పరుగులు అవసరమైన దశలో జోరుమీదున్న జెమీమా రోడ్రిగ్స్‌ (33 నాటౌట్‌) క్రీజులో ఉండటంతో చేతిలో 4 వికెట్లు ఉండటంతో ఛేదన పెద్ద కష్టం కాదనిపించింది. అయితే మరో ఎండ్‌లో అమన్‌జ్యోత్‌ కౌర్‌ (10), స్నేహ్‌ రాణా (0), దేవిక వైద్య (0) వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఉత్కంఠగా మారిపోయింది.

12 బంతుల్లో 9 పరుగులు రాబట్టాల్సిన సమయంలో చేతిలో ఒక్క వికెట్‌ మాత్రమే ఉన్న భారత్‌.. 49వ ఓవర్లో 6 పరుగులు చేసింది. దీంతో విజయసమీకరణం 6 బంతుల్లో 3 పరుగులకు చేరింది. చివరి ఓవర్‌ తొలి రెండు బంతులకు సింగిల్స్‌ రావడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది. మూడో బంతికి మేఘన వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో.. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. హర్లీన్‌ డియోల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ఫర్జానా హక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

Tags :

  • Cricket News
  • IND VS BAN
  • indian cricket team
  • Womens Cricket
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam