క్రికెట్ అనేది ఓ గేమ్. అందులో ఓ జట్టు గెలిస్తే, మరో జట్టు ఓడిపోతుంది. ఇవే కాదు కొన్నిసార్లు జరిగిన చిన్న విషయాలు.. పెద్ద చర్చకు దారితీస్తాయి. అలా గత కొన్నేళ్లలో బాగా చర్చనీయాంశమైన విషయం మన్కడింగ్. ఐపీఎల్ లో బట్లర్ ని అశ్విన్.. ఇదే స్టైల్లో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ఔట్ చేసినప్పుడు రచ్చ రచ్చ జరిగింది. ఇటీవల కాలంలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లని మీడియా పర్సన్స్ కూడా ఇదే టాపిక్ గురించి ప్రశ్నిస్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ రివ్యూలో పాల్గొన్న హార్దిక్ పాండ్య.. నాన్ స్ట్రైకర్ ఎండ్ రనౌట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ‘అసలు మనం ఈ నాన్ స్ట్రైకింగ్ రనౌట్ గురించి ముందు చర్చ మానేయాలి. ఇంత డిస్కషన్ అవసరం లేదు క్రికెట్ లో అన్నింటిలానే ఇది కూడా ఓ రూల్. క్రీడాస్పూర్తి లాంటి వాటికి ఇక్కడ ప్లేస్ లేదు. వ్యక్తిగతంగా ఈ తరహా రనౌట్ పై నాకైతే ప్రాబ్లమ్ లేదు. నేను క్రీజు దాటినప్పుడు ఇలా ఎవరైనా ఔట్ చేస్తే.. నోరు మూసుకుని వెళ్లిపోతాం. అది నా తప్పు. అలా ఔట్ చేయొచ్చని రూల్ కూడా ఉంది కదా..’ అని హార్దిక్ చెప్పాడు.
గత నెలలో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. మూడో వన్డేలో మన స్పిన్నర్ దీప్తి శర్మ.. ఇంగ్లీష్ బ్యాటర్ చార్లీ డీన్ ని నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ఔట్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ మీడియా అదేపనిగా మన జట్టుపై విమర్శలు చేసింది. ఇటీవల ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20లోనూ స్టార్క్, బట్లర్ ని మన్కడింగ్ చేస్తానని హెచ్చరించాడు. ఐసీసీ రూల్స్ లో ఉన్నాసరే ఇంగ్లాండ్ మీడియా మాత్రం.. దీనిపై డిస్కషన్ ఆపట్లేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్య.. వాళ్లందరికీ కూడా డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. మరి హార్దిక్ కుండ బద్దలు కొట్టేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.