ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022ను ఇంగ్లండ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ అదృష్టం కొద్ది సెమీస్ చేరింది. కానీ.. సెమీస్‌లో పటిష్టమైన టీమిండియాను ఏకంగా 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్‌ను ఓడించి.. పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దీంతో రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. అయితే.. 2016లో ఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లండ్.. అప్పుడే వరల్డ్ కప్ గెలవాల్సింది. కానీ.. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు సమర్పించుకుని.. వరల్డ్ కప్‌ను పొగొట్టాడు. కానీ.. ఆ తర్వాత 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో విరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను తొలి సారి వన్డే ఛాంపియన్‌గా నిలిపాడు.
అలాగే పాకిస్థాన్‌తో జరిగిన ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో రాణించి ఇంగ్లండ్‌ను రెండో సారి ఛాంపియన్‌గా నిలిపాడు. కేవలం 138 పరుగుల టార్గెట్‌నే ఛేదించాల్సి ఉన్నా.. పటిష్టమైన బౌలింగ్ ఎటాక్ పాకిస్థాన్ అంత ఈజీగా ఇంగ్లండ్‌కు విజయం ఇవ్వలేదు. తొలి ఓవర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను షాహీన్ అఫ్రిదీ అవుట్ చేయడం వెంటవెంటనే మరో రెండు వికెట్లు పడిపోవడంతో.. మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ.. ఒక ఎండ్‌లో బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలబడి ఆడాడు. పాక్ బౌలర్లు చెలరేగుతుంటే.. మిగతా బ్యాటర్లలా తొందరపడకుండా.. లక్ష్యానికి తగ్గట్లు ఆచితూచి ఆడి.. ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడినట్టే ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శన చేసిన బెన్ స్టోక్స్.. 2016లో తన వల్ల కోల్పోయిన టీ20 వరల్డ్ కప్‌ను తానే అందించాడు. కాగా.. ఈ వరల్డ్ కప్ కంటే ముందు.. బెన్ స్లోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి.. టెస్టు, టీ20ల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఇంగ్లండ్ వన్డే జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా కూడా వ్యవరిస్తున్నాడు. కానీ.. ఈ వరల్డ్ కప్‌లో బెన్ స్టోక్స్ ప్రదర్శన చూసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు స్టోక్స్‌ను తన వన్డే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2023లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని.. స్టోక్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫైనల్స్ లాంటి హైప్రెషర్ ఉండే మ్యాచ్‌ల్లో ఒత్తిడి తట్టుకుని బ్యాటింగ్ చేసే స్టోక్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఎంతో కీలకంగా ఉంటాడని.. అందుకే ఆ ఒక్క వరల్డ్ కప్ ఆడాలని స్టోక్స్‌ను బోర్డు పెద్దలు బ్రతిమిలాడుతున్నారు. మరి స్టోక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
🚨 JUST IN 🚨
👉 England Cricket Board is likely to request Ben Stokes to come out of ODI retirement 🏴
👉 ECB wants Stokes to feature in their ODI team ahead of the upcoming World Cup 2023 🏆#IPLretention #IPL2023 pic.twitter.com/XFm7aWCT6M
— SportsBash (@thesportsbash) November 15, 2022