క్రికెట్‌కు మరో గ్రేట్ ప్లేయర్ గుడ్‌బై చెప్పేశాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టుకు ఎలా ఆడాలో నేర్పిన స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022ను ఇంగ్లండ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ అదృష్టం కొద్ది సెమీస్ చేరింది. కానీ.. సెమీస్‌లో పటిష్టమైన టీమిండియాను ఏకంగా 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్‌ను ఓడించి.. పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దీంతో రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. అయితే.. 2016లో ఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లండ్.. అప్పుడే వరల్డ్ కప్ గెలవాల్సింది. […]
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదో మినీ యుద్ధం. పాక్ ఓడితే భారత్‌లో, ఇండియా ఓడితే పాకిస్థాన్‌లో సంబురాలు అంబరాన్ని అంటుతాయి. ఓడిన జట్టుపై ఆ దేశ అభిమానులే ఒక రేంజ్లో విమర్శలు గుప్పిస్తారు. ఓటమికి కారణమైన ప్లేయర్‌ను దారుణంగా ట్రోల్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఇండియా-పాకిస్థాన్‌ను మ్యాచ్ ఒక క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా పరువులా ఫీలవుతారు, శత్రువుతో చేసే యుద్ధంలా భావిస్తారు. […]
టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను గట్టిగా హెచ్చరించారు. ‘మీ పని మీరు చూస్కోండి. ఇండియన్ క్రికెట్ విషయంలో తలదూర్చాల్సి అవసరం లేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్‌కు, అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ఇతర లీగ్‌లలో పెట్టుబడులు పెట్టడంపై ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం క్రికెట్‌కు పెను ప్రమాదం అని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ […]
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ ఇటివల వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందర్ని షాక్‌కు గురిచేశాడు. టీమిండియాతో ఇటివల మూడు వన్డేల సిరీస్ ముగిసిన మరుసటి రోజే సంచలన నిర్ణయం ప్రకటించాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డేతో బెన్‌స్టోక్స్ తన చివరి వన్డే ఆడేశాడు. అయితే.. తాను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి బిజీ షెడ్యూలే కారణమని.. మూడు ఫార్మాట్లలో ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. […]
భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి మూడు రోజులు పైచేయి సాధించిన భారత్.. విజయం సాధించేలా కనిపించింది. కానీ.. నాలుగురోజు ఇంగ్లండ్ మ్యాచ్ మొత్తాన్ని తమవైపు తిప్పుకుంది. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టీమిండియా మాజీ కెప్టెన్, […]