పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్‌ను టీమిండియా కోచ్ రవిశాస్త్రి సహా భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్‌లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ చూస్తూ కనిపించడం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సోమవారం ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు అదే మైదానంలో పాకిస్తాన్-వెస్ట్ ఇండీస్ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఇంగ్లండ్, భారత్ ఆటగాళ్లు పాక్-విండిస్ మ్యాచ్‌ను తిలకించారు.
కాగా టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా ఈ నెల 24న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా గత కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇండియాతో మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. అతని ఆటపైనే పాకిస్తాన్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బాబర్ ఇండియన్ బౌలర్లను ఇప్పటి వరకూ ఎదుర్కొలేదు. ఎందుకంటే ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగి చాలా కాలం అయింది.
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి తీరాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. పాక్ టీమ్‌లో టాప్ బ్యాట్స్‌మెన్ అయిన బాబర్‌ను కట్టడి చేస్తే టీమిండియాకు గెలుపు చాలా సులువు అవుతుంది. అందుకోసమే బాబర్ ఆట తీరును అంత పరిశీలనగా భారత్ కోచ్, యువ బౌలర్లు చూసినట్లు తెలుస్తుంది. కాగా బాబర్ వన్డే బ్యాట్స్‌మెన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్నాడు. విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఫిఫ్టీ కొట్టాడు.