అది ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా క్రికెట్ లవర్స్ కి మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. తమ అభిమాన క్రికెటర్లు బ్యాట్ ఝులిపిస్తూ ఫోర్లు, సిక్సర్లుతో విరుచుకుపడుతుంటే క్రికెట్ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
అది ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా క్రికెట్ లవర్స్ కి మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. తమ అభిమాన క్రికెటర్లు బ్యాట్ ఝులిపిస్తూ ఫోర్లు, సిక్సర్లుతో విరుచుకుపడుతుంటే క్రికెట్ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పై పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా చేసిన వింత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యలపై వీరిద్దరిని మీమ్స్, స్ఫూఫ్ వీడియోలతో నెటిజన్స్ ట్రోల్ చేస్తూన్నారు. ఈ వ్యాఖ్యలు లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఓ మ్యాచ్ లో రమీజ్ రాజా ఆ వ్యాఖ్యలు చేశారు.
లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రైకర్స్ తరఫున బాబర్ ఆజమ్ ఆడుతున్నాడు. కొలంబో స్ట్రైకర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయితే నిన్న పల్లెకెలె వేదికగా గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. బాబార్ ఆజమ్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి సెంచరీ అందుకున్నాడు. టీ20 కెరీర్‌లో బాబర్ ఆజమ్‌కి ఇది 10వ సెంచరీ. మొత్తంగా 264 టీ20 మ్యాచులు ఆడిన బాబర్ ఆజమ్, 10 సెంచరీలతో టి20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన లిస్ట్ లో రెండవ స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజమ్‌కి ముందు క్రిస్ గేల్ మాత్రమే టీ20ల్లో 10కి పైగా సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు.. 463 టీ20 మ్యాచులు ఆడిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, 22 సెంచరీలతో ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు.
పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా, ప్రస్తుతం లంకప్రీమియర్ లీగ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా కొలంబో స్ట్రైకర్స్, గాలే టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజమ్ మెరుపు బ్యాటింగ్ తో సెంచరీ కొట్టిన తర్వాత బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ను ఉద్దేశిస్తూ రమీజ్ రాజా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.. రమీజ్ రాజా ఏమన్నాడంటే.. ‘క్లాస్, క్వాలిటీతో కూడిన ఇన్నింగ్స్. జట్టును విజయ తీరాలకు చేర్చే ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. నాకు బాబర్ ఆజమ్ అంటే ఎంతో ప్రేమ. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా..’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
‘I absolutely love him, want to marry him’ – Former PCB chairman Ramiz Raja re Babar Azam ♥️#LPL2023 #LPLT20 pic.twitter.com/4uQwXVz4vR
— Farid Khan (@_FaridKhan) August 8, 2023