పాక్ ఫ్యాన్స్ అతడిని తెగ పొగిడేస్తుంటారు. చెప్పాలంటే ఆకాశానికెత్తేస్తుంటారు ఆ దేశంలోని అద్భుతమైన క్రికెటర్లలో అతడు ఒకడు. కానీ ఏం లాభం.. ఓ లీగ్ వేలంలో ఇతడిని కనీసం పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇంతకీ ఏంటి విషయం?
బాబర్ ఆజామ్.. పాక్ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న ఇతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. కొన్ని విషయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసి ఉండొచ్చు. అంత మాత్రాన కింగ్ కంటే గొప్పోడు అనలేం కదా! కానీ బాబర్ ఫ్యాన్స్ మాత్రం ‘మావాడు తోపు.. కోహ్లీ కంటే తురుము’ అని తెగ ఎగిరిపోతుంటారు. ఇప్పుడు అదే బాబర్ కు ఘోరంగా అవమానం జరిగింది. వరసగా రెండో ఏడాది కూడా ఆ టోర్నీ వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో బాబర్ అభిమానులకు ఏమని కౌంటర్ ఇవ్వాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రికెట్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ తరహాలోనే పలు దేశాల్లో టీ20 లీగులు పుట్టుకొచ్చాయి. వాటిలో కాస్త చెప్పుకోదగ్గది అంటే ‘బిగ్ బాష్’. ఆ తర్వాత వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లోనూ ఈ తరహా లీగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ లో గత రెండేళ్ల నుంచి ‘ద హండ్రెడ్’ లీగ్ నిర్వహిస్తున్నారు. 100 బంతులు మాత్రమే ఉండే ఈ లీగులో చాలామంది స్టార్స్ ఆడుతున్నారు. గతేడాది జరిగిన వేలంలో పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ ని ఎవరూ తీసుకోలేదు. దీంతో అప్పట్లో ఆ విషయం కాస్త పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ బాబర్ పై సెటైర్లు పేలాయి.
ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 27వ తేదీల మధ్య జరగబోయే కొత్త సీజన్ కోసం వేలం (డ్రాఫ్టింగ్) నిర్వహించారు. ఈసారి కూడా బాబర్, రిజ్వాన్ లకు చుక్కెదురైంది. వీళ్లతోపాటు విండీస్ స్టార్ ఆల్ రౌండర్స్ అయిన పొలార్డ్, ఆండ్రూ రసెల్ ని కూడా ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలోనే బాబర్ అన్ సోల్డ్ కావడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో బాబర్ ఫామ్ కూడా ఏమంత ఎఫెక్టివ్ గా లేదు. బహుశా ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి బాబర్ ‘ద హండ్రెడ్’ లీగులో అమ్ముడు పోకపోవడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Babar Azam, Mohammad Rizwan, Kieron Pollard and Andre Russell are unsold in ‘The Hundred’ draft.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2023