పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ప్రస్తుత క్రికెట్లో తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. అయితే బ్యాటర్ గా అదరగొడుతున్న బాబర్ వ్యక్తిగతంగా విమర్శకులకు కారణమవుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ కంటే బిగ్ బాష్ లీగ్ తనకిష్టమని సంచలన వ్యాఖ్యలు చేసిన బాబర్ తాజాగా తనకిష్టమైన నలుగురు క్రికెటర్ల పేర్లు చెప్పేసాడు. ఈ లిస్టులో కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం.
నీ అభిమాన క్రికెటర్ ఎవరు అంటే అందులో విరాట్ కోహ్లీ పేరు ఉండకపోవచ్చు. కానీ నీకు నచ్చిన నలుగురు క్రికెటర్లు ఎవరంటే మాత్రం 99 శాతం అందులో కోహ్లీ ఉంటాడు. మిగిలిన ఆ ఒక్క శాతంలో కోహ్లీ లేకపోయినా.. ఆ స్థానంలో అతనికి దీటైన, పోటీనిచ్చే బ్యాటర్ ని ఎంచుకొన్న పర్వాలేదు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్.. కోహ్లీ కన్నా పాకిస్థాన్ అబ్దుల్లా షఫీక్ బెటర్ అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సహచర ప్లేయర్ ని వెనకేసుకొని రావడంలో అర్ధం ఉన్నప్పటికీ..ఇలా పరోక్షంగా కోహ్లీని అవమానించడం మాత్రం ఏ మాత్రం బాగా లేదు. బాబర్ ఇలా చెప్పడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ప్రస్తుత క్రికెట్లో తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో 5000 పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. వేగంగా(97 ఇన్నింగ్స్) ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ అజాం భవిష్యత్తులో కోహ్లీ రికార్డులు బద్దలు కొడతాడని కొంత మంది మాజీలు జోస్యం కూడా చెప్పారు. అయితే బ్యాటర్ గా అదరగొడుతున్న బాబర్ వ్యక్తిగతంగా విమర్శకులకు కారణమవుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ కంటే బిగ్ బాష్ లీగ్ తనకిష్టమని సంచలన వ్యాఖ్యలు చేసిన బాబర్ తాజాగా తనకిష్టమైన నలుగురు క్రికెటర్ల పేర్లు చెప్పేసాడు. ఈ లిస్టులో విల్లియంసన్, రూట్, బట్లర్, అబ్దుల్ షఫీక్ ఉన్నారు.
సమకాలీన క్రికెటర్లలో గొప్ప బ్యాటర్లుగా పేరొందిన విల్లియంసన్, రూట్ పేర్లు చెప్పడంలో అర్ధం ఉంది. కానీ బట్లర్, షఫీక్ పేర్లు చెప్పడం.. ముఖ్యంగా తమ జట్టు ప్లేయర్ అబ్దుల్లా షఫీక్ పేరు చెప్పడం ఇప్పుడు చాలా అనుమానాలకు దారి తీస్తుంది. పాకిస్థాన్ కి భారత్ మీద కోపం ఉన్న మాట నిజమే కానీ వ్యక్తిగతంగా ఇలా టార్గెట్ చేయడం బాబర్ కి ఖచ్చితంగా చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. కోహ్లీ సాధించిన దానిలో కనీసం సగం కూడా సాధించని బాబర్.. ఇలా కోహ్లీని అవమానించడం అతని ఓవర్ యాక్షన్ కి ప్రతీక. అంతే కాదు కోహ్లీ కన్నా బాబర్ బెస్ట్ బ్యాటర్ అనే ఓవర్ కాన్ఫిడెంట్ తనలో ఉంది. ఈ లక్షణమే బాబర్ అజాం కెరీర్ ని దెబ్బ తీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దిగ్గజాలకు మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా పరోక్షంగా అవమానిస్తే భవిష్యత్తులో బాబర్ కి కూడా ఇలాంటి గతే పడుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.