ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతోంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మెుదట యంగ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి మెరుపులు మెరిపిస్తే.. తర్వాత సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లపై యుద్ధాన్నే ప్రకటించాడు. మరోసారి తన మార్క్ షాట్స్ తో మైదానం నలువైపులా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అసలు మనం చూస్తుంది లైవ్ మ్యాచ్ ఆ.. హైలెట్స్ ఆ.. అన్నంతగా బౌలర్లను ఊచకోత కోశాడు. సూర్యకుమార్ విధ్వంసంతో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. దాంతో టీ20 సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య పలు రికార్డులను కొల్లగొట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సూర్యకుమార్.. క్రీజ్ లో ఉంటే ఎంతటి బౌలర్ కైనా చమటలు పట్టాల్సిందే. గత కొన్ని రోజుల నుంచి థండర్ ఫామ్ లో ఉన్న సూర్య భాయ్.. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లలతో లంక బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్ లో 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో టీ20ల్లో మూడో శతకాన్ని నమోదు చేసుకున్నాడు సూర్య. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా పలు రికార్డులు తన పేర లిఖించుకోవడంతో పాటుగా.. మరికొన్ని రికార్డులు కొల్లగొట్టాడు SKY.అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్ గా సూర్య చరిత్ర సృష్టించాడు. టీ20 సెంచరీల్లో మూడు సెంచరీలు సాధించి మాక్స్ వెల్, కొలిన్ మున్రోలతో సమానంగా రెండో స్థానంలో నిలిచాడు సూర్య.
𝓢𝓮𝓷𝓼𝓪𝓽𝓲𝓸𝓷𝓪𝓵 𝓢𝓾𝓻𝔂𝓪 👏👏
3⃣rd T20I ton for @surya_14kumar & what an outstanding knock this has been 🧨 🧨#INDvSL @mastercardindia pic.twitter.com/kM1CEmqw3A
— BCCI (@BCCI) January 7, 2023
అదీకాక టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో రెండో స్థానంలో నిలిచాడు. మెుదట స్థానంలో హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ.. నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూర్య ఫామ్ చూస్తే.. రోహిత్ రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో అరుదైన ఘనతను సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 1500 పరుగులు పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 843 బంతుల్లోనే 1500 పరుగులు పూర్తి చేశాడు సూర్య. ఇక భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ప్లేయర్ గా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 35 బంతుల్లో ఇదే శ్రీలంక జట్టుపై సెంచరీ బాదగా.. సూర్య 45 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఒక్క సెంచరీతో నే సూర్యకుమార్ యాదవ్ రికార్డులన్ని కొల్లగొట్టాడు.
India begin 2023 with a series win.#INDvSL pic.twitter.com/pfjvK3WQci
— CricTracker (@Cricketracker) January 7, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లుకు 228 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ 112 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే.. శుభ్ మన్ గిల్(46), త్రిపాఠి(35), అక్షర్(21) పరుగులు సాధించారు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. జట్టులో కుశాల్ మెండిస్(23), డీ సిల్వా(22), కెప్టెన్ షణక(23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, పాండ్యా, ఉమ్రాన్, చాహల్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్య కు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దక్కించుకున్నాడు. వన్డే సిరీస్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది.
Suryakumar Yadav registers the first international for India in 2023.
📸: Disney + Hotstar#INDvSL | @surya_14kumar pic.twitter.com/L64b6jsH0H
— CricTracker (@Cricketracker) January 7, 2023
Suryakumar Yadav in T20I:
Runs – 1578
Balls – 875
Average – 46.41
Strike Rate – 180.34
Hundreds – 3
Fifties – 13 pic.twitter.com/4EdiXtcXRC— Johns. (@CricCrazyJohns) January 7, 2023