మరికొన్ని రోజుల్లో ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో క్రికెట్ హంగామా మొదలవుతోంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. కాగా ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ టీ.నటరాజన్ వికెట్లు విరగ్గొడుతున్నాడు.
అత్యంత వేగంతో బంతులు విసిరే నటరాజన్ ఇప్పటికే ఐపీఎల్‌లో మంచి సక్సెస్‌ఫుల్ బౌలర్. గత సీజన్‌లో గాయం కారణంగా పూర్తి సీజన్ ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో నటరాజన్‌ను SRH రూ.4 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు కూడా నటరాజన్ సన్‌రైజర్స్‌కే ఆడాడు. ఇప్పటి వరకు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రాజన్ 20 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఐపీఎల్ 2022 కోసం సంసిద్ధం అవుతున్నాడు.
ప్రస్తుతం ప్రాక్టీస్‌లో అతను వేస్తున్న బౌలింగ్‌కు బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తుంది. భీకరమైన స్పీడ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించే రాజన్.. ఐపీఎల్‌కు ముందే తన వేగంతో వికెట్లను విరగ్గొడుతున్నాడు. కాగా రాజన్.. సూపర్ ప్రాక్టీస్‌ను సన్‌రైజర్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. రాజన్ వికెట్ విరగ్గొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇషాన్ కిషన్‌ను అందుకే వద్దనుకున్నాం: SRH బౌలింగ్ కోచ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.