న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. తొలి వన్డేని 12 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ దగ్గర్నుంచి బ్రేస్ వెల్ పోరాటం, సిరాజ్ విజృంభణ, శార్దూల్ కీలక వికెట్ తీయడం, హార్దిక్ పాండ్యా అవుట్ విషయంలో అనుమానాలు ఇలా చాలా అంశాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటిని పక్కన పెడితే మరో విషయం మాత్రం బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఇషాన్ కిషన్‌పై గవాస్కర్ సీరియస్ అవ్వడం. అవును కిషన్ పై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు? ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ వేదికగా జరిగిన టీమిండియా- కివీస్ తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. 40వ ఓవర్లో పాండ్యా బ్యాటింగ్ చేస్తుండగా.. డారిల్ మిచెల్ వేసిన బంతిని హార్దిక్ మిస్ అయ్యాడు. అది నేరుగా స్టంప్స్ మీదకు వెళ్లింది. కానీ, స్టంప్స్ ని తాకలేదు. లేథమ్ గ్లౌస్ లోకి వెళ్లింది. లేథమ్ గ్లౌవ్ తాకి.. బెయిల్ ముందుకు పడింది. అప్పీల్ చేయగా థర్డ్ అంపైర్ లేథమ్ గ్లౌస్ ని పట్టించుకోకుండా బౌల్డ్ కింద నిర్ణయం తీసుకుని హార్దిక్ పాండ్యాని పెవిలియన్ కు పంపారు. ఈ విషయంపై కామెంటేటర్లు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. థర్డ్ అంపైర్ లేథమ్ గ్లౌస్‌ని అసలు పట్టించుకోలేదంటూ కామెంట్ చేశారు.
Was Hardik Pandya really out ??#CricketTwitter looks like keeper gloves hit bells .. pic.twitter.com/2ycbZzCDX4
— Paresh Deshmukh (@PareshD12462540) January 18, 2023
రెండో ఇన్నింగ్స్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కాకపోతే అలా జరగాడినికి కారణం ఇషాన్ కిషన్. అతను లేథమ్ పై హిట్ వికెట్ ప్రాంక్ చేశాడు. 16వ ఓవర్ వేస్తున్న కుల్దీప్ యాదవ్.. నికోల్స్ ని బౌల్డ్ చేశాడు. తర్వాత లేథమ్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే ఇషాన్ కిషన్ బెయిల్స్ ని పడేసి హిట్ వికెట్ అంటూ అప్పీల్ చేశాడు. మిగిలిన వాళ్లు కూడా అదే అనుకుని అప్పీల్ చేశారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రివ్యూ కోరాడు. తర్వాత పరిశీలించగా అది కిషన్ చేసిన పనిగా తేలింది. అప్పటికే కిషన్ నవ్వుతూ ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుని టీమిండియా ఆటగాళ్లు నవ్వుతూ వెళ్లిపోయారు. కిషన్ చేసిన పనిని టీమిండియా ఫ్యాన్స్ అంతా మెచ్చుకుంటున్నారు. కానీ, టీమిండియా స్టార్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు.
And how is this even appealed by @ishankishan51 and then to top it off referred by Nitin Menon?
“’That is not on, That is not cricket,” – Sunil Gavaskar pic.twitter.com/eXWemifHvw
— my0p1n10n (@my0p1n10n1) January 18, 2023
ఇషాన్ కిషన్- లేథమ్ విషయంలో అలా ప్రాంక్ చేయడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ వారించాడు. ఇంగ్లీష్ కామెంటరీ చేస్తున్న సన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. “అసలు అది ఏమాత్రం పద్ధతి కాదు. ఆమెదయోగ్యం అస్సలే కాదు. అసలు అది క్రికెటే కాదు” అంటూ తీవ్రంగా ఖండించాడు. తనతో కామెంటరీ చేస్తున్న మురళీ కార్తీక్ సైతం కిషన్ తీరును విమర్శించాడు. కిషన్ సరదాకి అలా చేసినా కూడా అప్పీల్ చేయకుండా ఉండాల్సింది అంటూ అభిప్రాయపడ్డాడు. మాజీలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇషాన్ కిషన్ చేసిందే కరెక్ట్ అంటూ వెనకేసుకొస్తున్నారు. లేథమ్ చేసిన పనిని అతనికి తెలిసేలా చేశాడంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Ishan Kishan Remove Balls#INDvNZ pic.twitter.com/fggpRbZFpi
— Tajudin Khan (@Tajudinkhan100) January 18, 2023