హిట్‌మ్యాన్, ఒంటిచేత్తో జట్టు గెలిపించగల బ్యాట్స్‌మెన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చి కొద్ది సేపు ఆచితూచి ఆడి సెటిల్ అయ్యేవరకు పుల్ షాట్ ఆడవద్దని సూచించాడు. ఇటీవల రోహిత్ పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకుంటున్న విషయం తెలిసిందే. నిజానికి పుల్ రోహిత్ ఫేవరేట్ షాట్. కానీ అది కాస్త హిట్‌మ్యాన్ బలహీనతగా మారింది. దాంతో ప్రతీ జట్టు బౌలర్.. రోహిత్‌కు ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో రెచ్చగొడుతూ.. దానికి తగ్గ ఫీల్డ్ సెట్ చేసి రోహిత్‌ను బోల్తా కొట్టిస్తున్నారు.
కొన్నిసార్లు రోహిత్ పర్‌ఫెక్ట్‌గా ఆడినా.. ఎక్కువ సార్లు ఔటయ్యాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. లాహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను పుల్‌షాట్‌గా ఆడబోయి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే పుల్ షాట్ ఆడే విషయంలో రోహిత్ శర్మ అప్రమత్తంగా ఉండాలని గవాస్కర్ సూచించాడు. బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లోనైనా క్రీజులో సెట్ అయ్యేంతవరకు ఈ షాట్ ఆడవద్దని సలహా ఇచ్చాడు. మరి రోహిత్ శర్మకు గవాస్కర్ ఇచ్చిన సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar had a piece of advise for Rohit Sharma.https://t.co/urMWVux8Ky
— HT Sports (@HTSportsNews) March 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.