ఐపీఎల్ 2023లో కప్ గెలవడమే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ దూసుకెళ్తోంది. మంచి నిర్ణయాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే కాకుండా.. ఈ ఏడాది కప్ మనదే అన ధీమాను వారిలో నింపే ఒక సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉండగానే.. ఆ హీట్ మొదలైపోయింది. రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించే ఐపీఎల్ మార్చ్ 31న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌గా ఛాంపియన్‌గా నిలిచేందుకు అప్పుడే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ సారి ఎలాగైన కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. 2023 సీజన్ కోసం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో హ్యారీ బ్రూక్ లాంటి కొంతమంది స్టార్ క్రికెటర్లను కొనుగోలు మంచి పికింగ్స్ చేసింది.
ఆ వేలానికి ముందే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసి.. కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. జట్టుకు కెప్టెన్ ఎంపికలో టీమ్ ఓనర్ కావ్య మారన్ చాలా కేర్‌ఫుల్‌గా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్‌గా సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్కరమ్‌ను నియమించింది. గతంలో టీమ్ ఎంపిక, వేలంలో కొనే ఆటగాళ్లపై ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న కావ్య మారన్.. ఈ నిర్ణయంపై మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. మార్కరమ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా నియమించడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘ఈ సారి కప్పు సన్‌రైజర్స్‌దే రాసిపెట్టుకోండి’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్‌కు ఒక బలమైన కారణం, సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. మార్కరమ్ కెప్టెన్‌గా వ్యవహరించన ప్రతిసారి కప్ గెలుస్తున్నాడు. 2014లో సౌతాఫ్రికా అండర్ 19 కెప్టెన్‌గా ఆ జట్టుకు తొలి అండర్ 19 వరల్డ్ కప్ అందించాడు. పైగా కెప్టెన్‌గా ముందుండి రాణించాడు. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇటివల సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఎస్‌ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తొలి సీజన్‌లోనే సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను విజేతగా నిలబెట్టడంతో కావ్య మారన్ ఫుల్ ఇంప్రెస్ అయి ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు సైతం మార్కరమ్‌నే కెప్టెన్‌గా నియమించింది. ఇలా.. మార్కరమ్ కెప్టెన్‌గా పట్టిందల్లా బంగారు అవుతుండటంతో.. ఐపీఎల్‌లో తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మార్కరమ్ ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదబారాద్‌కు రెండో కప్ అందిస్తాడని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అన్నారు. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023