బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఒక ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిస్తుంది. టాలెంటెడ్ ప్లేయర్ల కోసం ప్రాంచైజ్‌లు పోటీ పడుతున్నాయి. ఊహించని విధంగా సాగుతున్న ఐపీఎల్‌లో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలంలో పాల్గొన్న పది జట్లకు అవసరమైన టేబుల్స్‌ను బీసీసీఐ సిద్ధం చేసింది. వారికి అవసరమైన వాటర్ బాటిల్స్, స్నాక్స్‌లను కూడా ఉంచింది.
కానీ అందరికి ఒక రకమైన వాటర్ బాటిల్స్ ఉంటే.. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ టేబుల్‌పై మాత్రం మరో రకమైన వాటర్ బాటిల్స్ ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తుంది. వారికి మాత్రమే అంత ప్రత్యేకత ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా ఒక బాటిల్ గౌతమ్ గంభీర్ దగ్గర కూడా ఉంది. మరి ముంబై ఇండియన్స్ టేబుల్‌పై ప్రత్యేక వాటర్ బాటిల్స్ ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.