దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్ ఒకడు. తన కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన స్టెయిన్ ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘ఇది ఒక సుదీర్ఘ డిసెంబర్ గత సంవత్సరం కంటే ఇది బాగుంటుందని చెప్పడానికి సందర్భాలు ఏమీ లేవు. ఇది 20 సంవత్సరాల శిక్షణ, మ్యాచ్‌లు, విజయాలు, ఓటములు, ఆనందం, సోదరభావం కలిగిన ప్రయాణం. పంచుకోవడానికి చాలానే జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ రోజు నేను చాలా ఇష్టపడే ఆట నుండి అధికారికంగా రిటైర్ అయ్యాను. బిట్టర్ స్వీట్ బట్ గ్రేట్ ఫుల్’ అంటూ భావోద్వేగంగా అభిమానులు, క్రికెట్‌కు స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ వీడ్కోలు పలికాడు.
2007-08 సంవత్సరంలో 16.24 సగటుతో 78 వికెట్లు తీసి డేల్ స్టెయిన్ 2008 ఐసీసీ టెస్ట్ క్రికెటర్ అవార్డు పొందాడు. 2013లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా, విస్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్‌ది వరల్డ్ గా పేరొందాడు. 2014లో విస్డెన్ క్రికెటర్స్ అల్మనాక్‌గా ఎంపికయ్యాడు. 2020లో ‘ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది డెకేడ్’లో స్టెయిన్‌కు స్థానం లభించింది. మరో అద్భుత ఘనత స్టెయిన్ సొంతం. 2,356 రోజులు ఐసీసీ ర్యాకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. అలా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఘనత డేల్ స్టెయిన్‌ది.
2004 డిసెంబర్ 17న ఇంగ్లాండ్‌పై టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టెయిన్ 93 టెస్టు మ్యాచుల్లో 22.95 బౌలింగ్ సగటుతో 439 వికెట్లు తీశాడు. 26 ఇన్నింగ్స్ లో 5 వికెట్లు చొప్పున తీశాడు. మూడు టెస్టుల్లో 10 చొప్పున వికెట్లు తీసిన ఘనత స్టెయిన్ సొంతం. 2019 ఫిబ్రవరి 21న శ్రీలంకపై ఆఖరి టెస్టు ఆడాడు. 2005 ఆగస్టు 17న వన్డేల్లో అరంగేట్రం చేసిన డేల్ స్టెయిన్ 125 వన్డేల్లో 22.95 బౌలింగ్ సగటుతో 196 వికెట్లు తీశాడు. మూడు వన్డేల్లో 5 వికెట్లు చొప్పున తీశాడు. వన్డేల్లో 39 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం స్టెయిన్ కెరీర్ బెస్ట్.
డేల్ స్టెయిన్‌కు ట్వట్టర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ‘క్రికెట్ చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో స్టెయిన్ ఒకడు’ అని వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘గొప్ప ఆటగాడు, గొప్ప వ్యక్తి, ఎన్నో అద్భుత అనుభవాలు’ అంటూ ఏబీ డెవిలియర్స్ స్పందించాడు. ‘ఫాస్ట్ బౌలర్‌గా 20 ఏళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు’ అంటూ ప్యాట్ కమిన్స్ ట్వీట్ చేశాడు.
Announcement. pic.twitter.com/ZvOoeFkp8w
— Dale Steyn (@DaleSteyn62) August 31, 2021