ఇండియన్ క్రికెట్ దశదిశను మార్చి.. టీమ్‌లోకి కొత్త కుర్రాళ్లను తెచ్చి స్టార్లను చేసిన కెప్టెన్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పేరుంది. అజహరుద్దీన్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన గంగూలీ ఒక కొత్త టీమిండియాను నిర్మించిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ఎంఎస్ ధోని, ఇర్ఫాన్ పఠాన్‌లాంటి స్టార్ క్రికెటర్లను ప్రొత్సహించింది గంగూలీనే. కెరీర్ తొలినాళ్లలొ ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కుర్రాళ్లకు అండగా ఉండి.. వారి పూర్తి స్థాయి టాలెంట్‌ను బయటికి తీశాడు.
2011లో టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన జట్టు గంగూలీ తయారుచేసిందే అనే వాదన ఉంది. ఇలా కొత్త కుర్రాళ్లను నెత్తిన పెట్టుకునే గంగూలీ.. తన తోటి సీనియర్ ఆటగాళ్లకు సైతం అండగా నిలబడేవాడు. వారి అవసరం జట్టుకు ఉందంటే.. వారి కోసం ఎవరినైనా ఎదిరించే తెగువ దాదా సొంతం. ఈ క్రమంలో ఒకసారి టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్‌కుంబ్లే కోసం ఏకంగా టీమ్ సెలెక్టర్లతోనే గొడవపడ్డాడు.
2003-04 మధ్య ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం గంగూలీ కెప్టెన్సీలో వెళ్లే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి గంగూలీ కూడా హాజరయ్యాడు. కానీ.. ఆ జట్టులో అనిల్ కుంబ్లే స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మురళీకార్తీక్‌ను తీసుకునేందుకు సెలెక్టర్లు నిర్ణయించారు. అనిల్ కుంబ్లే విదేశాల్లో వికెట్లు తీయలేకపోతున్నాడని, అతని స్థానంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జట్టులో ఉంటే మంచిదని సెలెక్టర్లు అభిప్రాయపడ్డారు.
హర్భజన్ సింగ్ రూపంలో అప్పటికే జట్టులో వికెట్ టేకింగ్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. అందుకే కుడిచేతి వాటం లెగ్‌స్పిన్నర్ కుంబ్లే స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మురళీ కార్తీక్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఫిక్స్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను ఆడేందుకు ఇబ్బంది పడుతుండడం కూడా సెలెక్టర్ల వాదనకు బలం చేకూర్చింది. కానీ.. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గంగూలీ మాత్రం కుంబ్లే జట్టులో ఉండాల్సిందే అని పట్టుబట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కుంబ్లే లాంటి సీనియర్ స్పిన్నర్ అవసరం జట్టుకు ఉందని సెలెక్టర్లకు వివరించాడు. అయినా సెలెక్టర్లు వినకపోవడంతో.. చాలా సేపు సెలెక్టర్లకు, గంగూలీకి మధ్య తీవ్రస్థాయిలో వాదన జరిగింది. చివరికి కుంబ్లే జట్టులో లేకుంటే నేను ఈ గది దాటి బయటికి వెళ్లనని.. దాదా మొండిపట్టు పట్టాడు. అప్పటికే సమయం రాత్రి 2 గంటలు అవుతుంది.
గంగూలీ పట్టుదలకు తలొగ్గిన సెలెక్టర్లు కుంబ్లేను జట్టులోకి తీసుకునేందుకు అంగీకరిస్తూనే.. దాదాకు ఒక టఫ్ కండీషన్ పెట్టారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కుంబ్లే వికెట్లు తీయలేకపోయినా, జట్టు ప్రదర్శన సరిగా లేకున్నా.. గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తామని సెలెక్టర్లు తెగేసి చెప్పారు. ఈ కండీషన్‌కు దాదా ఒప్పుకున్నాడు. తన కెప్టెన్సీ పోయినా పర్వాలేదు కానీ.. కుంబ్లే జట్టులో ఉండాలని అక్కడి నుంచి వచ్చేశాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆ సిరీస్‌లో కుంబ్లే 24 వికెట్లు తీసి.. సిరీస్‌లోనే టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో గంగూలీ తన పెట్టుకున్న నమ్మకానికి కుంబ్లే వందశాతం న్యాయం చేశాడు. సెలెక్టర్లతో ఈ ఫైటింగ్ ఎపిసోడ్‌ను గంగూలీనే ఒకసారి వెళ్లడించాడు. యువ క్రికెటర్లను ప్రొత్సహించడంతో పాటు సీనియర్ ఆటగాళ్ల అవసరమైన సమయంలో అండగా నిలిచాడు కాబట్టే ఇండియన్ క్రికెట్‌లో గంగూలీ ఒక గొప్ప కెప్టెన్‌గా కీర్తించబడుతున్నాడు. మరి కుంబ్లే విషయంలో గంగూలీ చూపించిన తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Around 2003, Anil Kumble was not in a good form. Selectors were not in mood to select him for upcoming Australia series.
What happened then ? Exceptional leader Sourav Ganguly @SGanguly99 is narrating.#Crickethttps://t.co/KtL6zqXz7x
— व्यासोन्मुखः (@Vyasonmukh) March 12, 2021
“If you were a batsman facing Anil Kumble, you knew that he had a plan for you.”
One of India’s finest on #ICCHallOfFame 📽️ pic.twitter.com/55Et7OWpdV
— ICC (@ICC) May 20, 2021
Let’s revisit Anil Kumble’s 10 wickets against Pakistan 🔥 #IndvsNZtest #INDvsNZTestSeriespic.twitter.com/vGZbrsrNyW
— Cricket Hotspot (@AbdullahNeaz) December 4, 2021
ఇది కూడా చదవండి: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!