వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పుడే తుది జట్టు గురించి ఒక అంచనా వేస్తున్నారు మాజీలు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ తుది జట్టు గురించి మాట్లాడాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తర్వాత స్వదేశంలో వరల్డ్ కప్ జరగనుండడంతో అభిమానులు భారీగానే అంచంనాలు పెట్టుకున్నారు. అంతే కాదు తొలి పూర్తి స్థాయిలో ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహించడం విశేషం. 1996, 2011 లో భారత్ లో వరల్డ్ కప్ మ్యాచులు జరిగినా అప్పుడు ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతో కలిసి భారత్ సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ కి ఆతిధ్యమిచ్చింది. అక్టోబర్ 5 న ఈ టోర్నీ ఇంగ్లాండ్, న్యూజీలాండ్ మ్యాచ్ తో స్టార్ట్ అవుతుంది. నవంబర్ 15,16 న రెండు సెమి ఫైనల్స్ ముంబై, కోల్ కత్తా లో నిర్వహించనుండగా.. గ్రాండ్ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక ఈ వరల్డ్ కప్ గురించి మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ వరల్డ్ కప్ గెలవాలంటే ఒక యంగ్ ప్లేయర్ పేరుని సూచించాడు.
వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పుడే తుది జట్టు గురించి ఒక అంచనా వేస్తున్నారు మాజీలు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ తుది జట్టులో ఓపెనర్ జైస్వాల్ ఖచ్చితంగా ఉండాలని ప్రతిపాదించాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఈ ముంబై కుర్రాడు అరంగ్రేట మ్యాచులోనే ఏకంగా 171 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ ఇలా ఏదైనా జైస్వాల్ పరుగుల ప్రవాహం ఆగడం లేదు. ప్రస్తుతం ఈ 21 ఏళ్ళ కుర్రాడి ఆట గంగూలీని విపరీతంగా ఆకట్టుకున్నటుంది. ఈ నేపథ్యంలో జైస్వాల్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ వరల్డ్ కప్ లో చోటుకి అవ్వాలి అని చెబుతున్నాడు.
“అరంగేట్రంలో జైస్వాల్ సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయం. నేను కూడా నా తొలి టెస్టు మ్యాచులోనే ఇంగ్లాండ్ మీద శతకం బాదేశాను. కాబట్టి అది ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు. టెక్నిక్ పరంగా చూసుకున్నా కూడా.. జైస్వాల్ చాలా సాలిడ్‌గా కనిపిస్తున్నాడు. టీంలో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం భారత్ కి కలిసి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జైస్వాల్ ని తప్పనిసరిగా వరల్డ్ కప్ లో ఆడించాలి”. అని ఈ సందర్భంగా గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జైస్వాల్ వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ఇంకా వన్డేలకు సెలక్ట్ కానీ జైస్వాల్ గంగూలీ చెప్పినట్లు తుది జట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.