టీమిండియాలో కొంతమంది టాలెంటడ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ఒక ప్లేయర్ విషయంలో గంగూలీ..బీసీసీఐ మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.
టీమిండియాలో కొంతమంది టాలెంటడ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. మాములు టోర్నీలయితే పర్లేదు గాని వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో కూడా అతనికి స్థానం లభించడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న బెంచ్ మీద కూర్చోపెట్టేస్తున్నారు. అతడెవరో కాదు టీమిండియా ప్రధాన లెగ్ స్పిన్నర్ “యుజ్వేంద్ర చాహల్”. ఎప్పుడూ జట్టుతో కలిసి ప్రయాణిస్తున్న ఈ లెగ్ స్పిన్నర్ కి తుది జట్టులో చోటు ఎందుకు కల్పించట్లేదంటూ గంగూలీ బీసీసీఐని సూటిగా ప్రశ్నించాడు. చాహల్ కి ఈ సారి ఎలాగైనా ఛాన్స్ కల్పించండి అని బీసీసీఐకి దాదా వార్నింగ్ ఇచ్చాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో చాహల్ చాలా కీలకమైన ప్లేయర్. టెస్టుల్లో పక్కన పెడితే వన్డే, టీ 20 ల్లో అవకాశం వచ్చిన ప్రతిసారి అద్భుతమైన ప్రదర్శన చేసాడు. కొన్ని మ్యాచులు విఫలమైనా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఫామ్ లో ఉన్న చాహల్.. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి నాలుగేళ్ల ముందు వరకూ టీమిండియాకి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్, జడేజాతో కలిసి భారత క్రికెట్ జట్టుకి అనేక విజయాలను అందించాడు. అయితే అనూహ్యంగా 2021 టీ20 వరల్డ్ కప్ కి చాహల్ ని పక్కన పెట్టేసారు. అశ్విన్ అనుభవం, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ కారణంగా చాహల్ ని పక్కన పెట్టేసారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఈ లెగ్ స్పిన్నర్ ని సెలక్ట్ చేసినా తుది జట్టులో చోటు దక్కనేలేదు.
చాహల్ కి ఈ వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇవ్వకుండా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో చాహల్ కి స్థానం కల్పించాలని గంగూలి డిమాండ్ చేసాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ” చాహాల్ ని ప్రతీసారి హానీమూన్ ట్రిప్ కి తీసుకెళ్తున్నారు తప్పితే ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం ఇవ్వడం లేదు. చాహాల్‌ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం టీమిండియా ఓటమికి కారణం. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై మన స్పిన్నర్లు కీ రోల్ పోషిస్తారు. 2023 వరల్డ్ కప్ లో చాహల్ ని ప్రధాన స్పిన్నర్ గా చాహల్ ని ఆడించాలి”. అంటూ కామెంట్ చేసాడు. మరి గంగూలీ చెప్పినట్లుగా చాహల్ కి 2023 వరల్డ్ కప్ తుది జట్టులో స్థానం కల్పిస్తారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.