టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. టీ20 సిరీస్ చేజారిపోకుండా కట్టడి చేయగలిగారు. ఫలితంగా మూడు మ్యాచుల ఈ సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచులో భారత యువ బ్యాటర్ స్మృతి మంధాన చితక్కొట్టే ఇన్నింగ్స్ ఆడింది. దీంతో మ్యాచ్ కాస్త వన్ సైడ్ అయింది. మరో 20 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అలానే స్మృతి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20లో భారత్ ఓడిపోగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో మన జట్టు విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో ఫ్రెయా కెంప్ 51, బౌచిర్ 34 పరుగులు చేశారు. మన బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు తీసింది.ఇక ఛేదనలో భారత్ కు అదిరి ఆరంభం లభించింది. ఓపెనర్ స్మృతి మంధాన 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇందులో 13 ఫోర్లు ఉండటం విశేషం. అలానే ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ విజయానికి కారణమైంది. దీంతో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. మిగతా బ్యాటర్లలో షెఫాలీ వర్మ 20, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులు చేశారు. ఇకపోతే నిర్ణయాత్మక మూడో టీ20, గురువారం జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు జరుగుతాయి. మరి రెండో టీ20లో స్మృతి అదిరిపోయే బ్యాటింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:స్మృతి మంధాన అరుదైన రికార్డ్! రోహిత్ శర్మ తర్వాత ఆమే..
.@mandhana_smriti bags the Player of the Match award for a terrific unbeaten 7⃣9⃣-run knock as #TeamIndia beat England in the 2nd T20I to level the series. 👏👏
It all comes down to the decider to be played on Thursday. 👊
Scorecard ▶️ https://t.co/Xvs9EDrb2y #ENGvIND pic.twitter.com/WTwA7nXshP
— BCCI Women (@BCCIWomen) September 13, 2022