Virat Kohli: ఐపీఎల్ 2023ను కోహ్లీ అద్బుత ఇన్నింగ్స్‌తో ఆరంభించాడు. అయితే.. ఓ యాంకర్ స్మృతి మంధాన డబ్ల్యూపీఎల్‌కు ముందు చేసిన కామెంట్‌ను ప్రస్తావిస్తూ.. కోహ్లీ పరువు తీశాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు శుభారంభం అందుకుంది. ఆదివారం పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేసి.. ఆర్సీబీని గెలిపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. గతేడాది కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం ఆర్సీబీపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ, ఇప్పుడు కోహ్లీ వింటేజ్ కోహ్లీని తలపిస్తున్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సారి ఆర్సీబీ జట్టు చాలా బలమైన జట్టుగా మారడం ఖాయం.
అయితే.. ఇదే ఏడాది మహిళా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబ్ల్యూపీఎల్ 2023లో ఆర్సీబీ ఫ్రాంచైజ్ సైతం తమ టీమ్‌ను బరిలోకి దింపింది. ఆ జట్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించారు. లీగ్ ఆరంభానికి ముందు ఆర్సీబీ సైతం టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉంది. అందుకు తగ్గట్లే మంధాన సైతం మంచి ప్రదర్శన కనబరుస్తామని ప్రకటించింది. ఐపీఎల్‌లో కోహ్లీ సాధించిన ఘనతను నేను అందుకునే ప్రయత్నం చేస్తానని ప్రకటించింది.
ఈ విషయాన్ని ఆర్సీబీ జట్టుతో ఉంటూ చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసే నాగ్ అనే యాంకర్.. తాజాగా కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. డబ్ల్యూపీఎల్‌కు ముందు స్మృతి మంధాన చేసిన కామెంట్‌ను ప్రస్తావిస్తూ.. ఆమె సరైన దారిలోనే వెళ్తుంది, ఎందుకంటే డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ రెండు విజయాలు సాధించింది అంటూ పేర్కొన్నాడు. కోహ్లీని దారుణంగా ట్రోల్ చేశాడు. కోహ్లీలానే స్మృతి మంధాన సైతం ఆర్సీబీకి కప్పు అందించకుండా బాగానే చేసిందని నాగ్ ఉద్దేశం. దానికి కోహ్లీ నవ్వుతూ.. సరదాగా తీసుకున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.