నేషనల్ క్రష్ గా పేరొందిన స్మృతి మందన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
భారత మహిళా క్రికెట్ లో స్మృతి మంధానకు ఒక సపరేట్ క్రేజ్ ఉంది. కేవలం తన ఆటతోనే కాదు అందంతోనూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ ఓపెనర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్ క్రష్ గా పేరొందిన స్మృతి మందన ఇటీవలే 27వ బర్త్ డే(జులై 18) సెలబ్రేట్ చేసుకుంది. భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో.. అక్కడే ఆమె పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. ఈ సందర్భంగా స్మృతి మంధానకు అబ్బాయిలు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేసి తమ అభిమానాన్ని తెలియజేసారు. అయితే విషెస్ తెలియజేసిన అభిమానులకి స్మృతి భారీ షాక్ ఇచ్చింది. ఆమె ఒకరితో డేటింగ్ లో ఉన్నట్లుగా ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్మృతి మంధాన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని పేరు పలాష్. ప్రముఖ సింగర్ పాలక్ ముచ్చల్‌కు చిన్న తమ్ముడు. ఇంస్టాగ్రామ్ వేదికగా పలాష్ కి 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇండోర్ కి చెందిన ఈ సింగర్ బాంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఉందని తెలుసుకొని అక్కడ స్మృతిని సర్‌ప్రైజ్ చేసాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఒకరికొకరు తెలుసట. అంతేకాదు ఒకరికొకరు సిసిల మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. ఆ మధ్య పలాష్ బర్త్ డే సందర్భంగా.. అతడితో కలిసి దిగిన ఫొటోలను స్మృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పలాష్ చేతిపై SM18 అనే అక్షరాలను టాటూ వేయించుకోవడంతో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. గత ఏడాది మంధాన పుట్టిన రోజ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విష్ చేసిన పలాష్.. నాకు తెలిసిన స్ట్రాంగెస్ట్ గర్ల్ అంటూ స్మృతిని ఆకాశానికెత్తేశాడు.
ఇక తాజాగా బంగ్లాదేశ్ టూర్ ముగించుకున్న టీమిండియా అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వన్డే సిరీస్ ని 1-1 తో డ్రాగా ముగించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మందాన టీ 20 సిరీస్ లో ఘోరంగా విఫలమైంది. తొలి టీ 20లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత రెండు టీ 20ల్లో వరుసగా 13,1 పరుగులు చేసింది. అయితే వన్డేల్లో మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. తొలి వన్డేల్లో 11 పరుగులే చేసినా ఆ తర్వాత రెండు వన్డేల్లో 36, 59 పరుగులు చేసింది. మొత్తానికి క్రికెట్ విషయం పక్కన పెడితే తన బాయ్ ఫ్రెండ్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.