భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మాన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు.
హర్మన్ ప్రీత్ కౌర్ ప్రపంచంలోనే టాప్ బ్యాటర్లలో ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటి చేత్తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొడుతూ మహిళా జట్టుని ముందుకు తీసుకు వెళ్లిన విధానాన్ని అభినందించాల్సిందే. అయితే ఈమె తాజాగా బంగ్లాదేశ్ టూర్ లో ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దురుసు ప్రవర్తన కారణంగా కౌర్‌కి 75 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా కోత విధించింది ఐసీసీ. మాజీలు కూడా ఆమె తీరుని తప్పు పడుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మాన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. ఇరు జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టై గా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి నాలుగు ఓవర్లో 14 పరుగులు చేయలేక చతికిలపడింది. దీంతో సిరీస్ 1-1 గా ముగిసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ తనను అవుట్ గా ప్రకటించినందుకు అంపైర్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బ్యాట్ తో వికెట్లను పడగొట్టింది. ఇక ఔటై పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో అంపైర్ పై నోరు పారేసుకుంది. మ్యాచ్ అనంతరం మీడియా సమాయవేశంలో అంపైరింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంతటితో ఆగకుండా సిరీస్ ట్రోఫీతో ఇరు జట్లతో జరిగిన ఫోటో సెషన్ లో బంగ్లాదేశ్ టీమ్ మీద కౌర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
“బంగ్లాదేశ్ మహిళల జట్టుతో కౌర్ ప్రవర్తన చాలా అమర్యాదగా ఉంది. ఆట కంటే ఎవరూ ముఖ్యం కాదు. హర్మన్ తన ప్రవర్తనతో భారత క్రికెట్ తో చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆమెకు జరిమానా సరిపోదు. కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆరు నెలల పాటు అన్ని ఫార్మాట్ ల నుంచి ఆమెను తొలగించాలి”. అని మదన్ లాల్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం మ్యాచ్ ఫీజ్ తో పాటు ఐసీసీ..ఆమెకి 3 డిమెరిట్ పాయింట్లు కూడా వేసింది. మరో ఐసీసీ లెవల్-2 నిబంధనను దాటినట్లు భావిస్తున్న నేపథ్యంలో హర్మన్‌కు 4 పాయింట్లు కేటాయిస్తే.. ఆమె ఒక టెస్టు లేక రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్ పడితే.. ఆసియా క్రీడల్లో తొలి మ్యాచ్‌లకు హర్మన్ దూరం కానుంది. అదే జరిగితే స్మృతి మందనకి కెప్టెన్సీ అవకాశం దక్కనుంది. మరి హర్మన్ విషయంలో మాజీ క్రికెటర్ మదన్ లాల్ మాటలు మీకెలా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
Harmanpreet’s behaviour against the Bangladesh women’s team was pathetic. She is not bigger than the game. She got a very bad name for Indian cricket. BCCI should take very strict disciplinary action.
— Madan Lal (@MadanLal1983) July 23, 2023