పదే పదే గాయాల బెడదతో జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై, భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతానికి బుమ్రాను మర్చిపోవడమే మంచిదని.. అతడు తిరిగి జట్టులోకి వచ్చాక అప్పుడు తుది జట్టులో అతని స్థానం గురుంచి మాట్లాడటం మంచిందని వ్యాఖ్యానించాడు.
టీమిండియాకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. ఆసియా కప్ నుంచి మొదలుపెడితే టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ సిరీస్, ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్.. మొత్తంగా చూస్తే వరస వైఫల్యాలు టీమిండియాకు శాపంగా మారాయి. అభిమానుల అయితే ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇక ఏడో ర్యాంకులో ఉన్న బంగ్లా జట్టుపై వన్డే సిరీస్ ఓడిపోవడం టీమిండియాని అభిమానించే ప్రతిఒక్కరినీ షాక్ కు గురిచేసింది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు డైరెక్ట్ గానే భారత జట్టు, […]