ఆటకన్నా మనుషులేం గొప్ప కాదు. ఎంత స్టార్ ఆటగాళ్లైనా సత్ప్రవర్తనతో నడుచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ విషయంలో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మినహాయింపేమీ కాదు.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. బంగ్లాదేశ్ సిరీస్ లో భాగంగా మూడో వన్డేలో హర్మన్ ప్రీత్ కౌర్ తనను అవుట్ గా ప్రకటించినందుకు అంపైర్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బ్యాట్ తో వికెట్లను పడగొట్టింది. ఇక ఔటై పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో అంపైర్ పై నోరు పారేసుకుంది. మ్యాచ్ అనంతరం మీడియా సమాయవేశంలో అంపైరింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంతటితో ఆగకుండా సిరీస్ ట్రోఫీతో ఇరు జట్లతో జరిగిన ఫోటో సెషన్ లో బంగ్లాదేశ్ టీమ్ మీద ఫోటో దిగేందుకు నిరాకరించింది. దీంతో హర్మన్ తీరుపై మాజీలు మండిపడుతున్నారు. ఈ లిస్టులోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కూడా చేరిపోయాడు.
ఆటకన్నా మనుషులేం గొప్ప కాదు. ఎంత స్టార్ ఆటగాళ్లైనా సత్ప్రవర్తనతో నడుచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ విషయంలో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మినహాయింపేమీ కాదు. మ్యాచ్ అనంతరం నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కౌర్ మ్యాచ్ ఫీజ్ లో 75 శాతం ఫైన్ వేశారు. అంతేకాదు తాజాగా ఐసీసీ కఠిన చర్యలు తీసుకొని రెండు మ్యాచుల నిషేధం విధించింది. అయితే ఈ శిక్ష సరిపోదంటున్నాడు మాజీ పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిది. కౌర్ కి 100 శాతం మ్యాచ్ ఫీజ్ విధించాలని తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆఫ్రిది మాట్లాడుతూ ఇండియన్ కెప్టెన్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
“హర్మన్ చేసిన పని నాకు మరీ అతిగా అనిపించింది. మరీ ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మ్యాచ్ ఫీజ్ లో 75 శాతం సరిపోదు. ఇలా చేస్తే 100 శాతం ఫైన్ విధించాలి. టీమిండియాలోని కాదు గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. మహిళా క్రికేట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తాం. హర్మన్ కి వేసిన శిక్ష భవిష్యత్తులో అందరి ప్లేయర్లకు ఒక గుణ పాఠం అవుతుంది. క్రికెట్ లో దూకుడుగా ఉండొచ్చు గాని ఆ దూకుడు నియంత్రణతో కూడైన విధంగా ఉండాలి”. అని ఆఫ్రిది సూచించాడు. ఇక కౌర్ మీద ఐసీసీ రెండు మ్యాచులు నిషేధం విధించడంతో ఆసియా క్రీడల్లో భాగంగా తొలి రెండు మ్యాచులకి దూరం కానుంది. కౌర్ స్థానంలో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న స్మృతి మందన భారత్ కి కెప్టెన్ బాధ్యతలు చేపడుతుంది. మొత్తానికి కౌర్ విషయంలో మాజీలు విమర్శలు ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.