సాధారణంగా క్రీడా ప్రపంచంలో కొంత మంది ఆటతో అదరగొడతారు. మరి కొంత మంది అందంతో అదరగొడతారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ముద్దుగుమ్మ మాత్రం అందం.. ఆట రెండిట్లోను అదరగొడుతోంది. తన ఆటతో ప్రత్యర్థి గుండెలను బద్దలు కొడుతుంది. అలాగే తన అందంతో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు ఓ అరుదైన రికార్డ్ సాధించి ఏకంగా రోహిత్ శర్మ తర్వతి స్థానంలో నిలిచింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
స్మృతి మంధాన.. అందానికి మరో పేరు.. అలా అని ఆటలో తక్కువే కాదండి బాబు. ఆమె బ్యాటింగ్ కు వస్తే ప్రత్యర్థి బౌలర్ కు చెమటలు పట్టడం ఖాయం. అంతలా రెచ్చిపోయి ఆడుతుంది మరి. ప్రస్తుతం భారత మహిళల జట్టు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గోంటున్న సంగతి తెలిసింది. దీనిలో భాగంగానే తాజాగా బార్బడోస్ తో జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధాన ఓ రికార్డ్ ను నెలకొల్పింది.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా బార్బడోస్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరిన స్మృతి మంధాన.. 2004 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ గా రోహిత్ తర్వత స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, కేఎల్ రాహుల్‌లను మంధాన అధిగమించింది. స్మృతి మంధాన 79 ఇన్నింగ్స్ ల్లల్లో 2000 పరుగులను పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించడంతో 100 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ ఘనత సాధించిన స్మృతి మంధాన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
టీమిండియా తరపున ఓపెనర్లుగా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారు!
1. రోహిత్ శర్మ-2973 పరుగులు
2. స్మృతి మంధాన- 2004 పరుగులు
3. శిఖర్ ధావన్- 1759 పరుగులు
4. మిథాలీ రాజ్- 1407 పరుగులు
5. కేఎల్ రాహుల్-1392 పరుగులు
ఇదీ చదవండి: రోహిత్ శర్మ ఆడకపోయినా భారత్ కు నష్టం లేదు: డానిష్ కనేరియా
ఇదీ చదవండి: వీడియో: రాక్షసుడులా మారిన షోయబ్ అక్తర్! లాంగర్ తల పగలకొట్టాలని చూశాడు!