భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు నిన్న డొమినికా వేదికగా ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భాగంగా ఒక ఆసక్తికరం ఘటన చోటు చేసుకుంది.
భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా మొదలైన ఈ మ్యాచులో తొలిరోజు టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొట్టి తొలి రోజే పట్టు బిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ భారత బౌలర్ల ధాటికి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. డెబ్యూ కుర్రాడు అతంజ చేసిన 47 పరుగులే అత్యధిక స్కోర్. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), జైస్వాల్ (40) క్రీజ్ లో ఉన్నారు. ఇక తొలి రోజు ఆటలో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
విండీస్ జట్టులోకి చాల సంవత్సరాల తర్వాత రహీం కార్న్ వాల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. చూడడడానికి భారీ ఆకారంతో ఉండే ఈ ఆజానుబాహుడు బాహుబలిని మించే కటౌట్ తో ఉంటాడు. విండీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయిన తర్వాత 9 వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఈ బాహుబలి మూడు ఫోర్లు కూటి మంచి టచ్ లో కనిపించాడు. క్రీజ్ లో కాస్త కుదురుకున్నట్టే కనిపించాడు. అయితే జట్టు స్కోర్ 148 పరుగుల వద్ద కార్న్ వాల్ నాన్ స్ట్రైకింగ్ కి వెళ్తున్న సమయంలో గిల్ అతని వైపు చూస్తూ డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. చూడడానికి చాలా ఫన్నీగా అనిపించిన ఈ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు గిల్ కాస్త చూసుకో అని కొందరు కామెంట్ చేస్తుంటే.. హనుమంతుడి ముందు గిల్ కుప్పిగంతులు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి కార్న్ వాల్ అయితే మాత్రం తన వికెట్ ని ఇవ్వలేదు. 19 పరుగులు చేసి నాటౌట్ గ నిలిచాడు. ఇక మ్యాచ్ కి ముందు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషాన్ తొలిసారి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. కిషన్ కీపింగ్ లో ఆకట్టుకోగా, ఓపెనర్ గా బ్యాటింగ్ కి దిగిన జైస్వాల్ 40 పరుగులతో తొలి మ్యాచులోనే ఆకట్టుకున్నాడు. ఇంకా నాలుగు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచులో విండీస్ తిరిగి పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. మరి గిల్ చేసిన డ్యాన్స్ మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
DO NOT MISS! Keep your eyes 👀 on the right side of the screen, we have a surprise Shubman Gill package for you!
He is truly enjoying the Caribbean atmosphere 🥳 🎉🕺🏻#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/jZRlqFdofl
— FanCode (@FanCode) July 12, 2023