ఎంత నైపుణ్యం ఉన్నా ఫిట్‌నెస్ లేకపోతే క్రికెట్‌లో రాణించడం కష్టమని మరోసారి రుజువైంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఏ సంఘటన చోటు చేసుకుంది.
క్రికెట్ లో ఆటతో పాటు ఫిట్ నెస్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు అయితే ఫిట్ నెస్ లేకపోతే ఎంత స్టార్ ప్లేయర్ ని అయినా పక్కన పెట్టేస్తారు. కానీ పాకిస్థాన్, వెస్టిండీస్ లాంటి జట్లు మాత్రం ఫిట్ నెస్ మీద అంతగా శ్రద్ధ చూపించరు. తాజాగా కనీస ఫిట్ నెస్ లేక విండీస్ ప్లేయర్ రాకీమ్ కార్న్‌వాల్ హాస్యాస్పద రీతిలో రనౌట్ అయ్యాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సెయింట్ లూసియా కింగ్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి బంతికే విండీస్ బాహుబలుడు రనౌటైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కార్న్‌వాల్ కి ఫిట్‌నెస్ లేకపోయినా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించగలడని తెలిసిన విషయమే. స్పిన్ బౌలింగ్ వేయడంతో పాటు, భారీ షాట్ లు కొట్టడంలో ఈ బాహుబలి దిట్ట. అందుకే అతని నైపుణ్యం మీద నమ్మకం ఉంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈ లీగ్ లో బార్బడోస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్న్ వాల్ ఓపెనర్ గా వచ్చి తొలి బంతికే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ తొలి బంతికి కార్న్‌వాల్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ మొదట తడబడ్డా ఆ తర్వాత బంతిని అందుకొని నాన్ స్ట్రయికర్ వికెట్ల వైపు విసిరాడు. అప్పటికే కైల్ మయేర్స్ పరుగు పూర్తి చేయగా.. రాకీమ్ మాత్రం క్రీజుకు చాలా దూరంలో నిలిచిపోయాడు. దీంతో తొలి బంతికి బార్బడోస్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ రనౌట్ పై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు భారీ స్కోర్ చేసింది. జట్టుతో ఎవ్వరూ హాఫ్ సెంచరీ చేయకపోయినా కెప్టెన్ డుప్లెసిస్ (46), సీన్ విలియమ్స్ (47), చార్లెస్ (30) భారీ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. లక్ష్యఛేదనలో బార్బడోస్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. యాంగ్ (48) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు.మొత్తానికి కార్న్ వాల్ రనౌట్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Tonight’s @BetBarteronline magic moment is the run out of Rahkeem Cornwall that set the Saint Lucia Kings off on a fantastic PowerPlay! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/HgDtLWTjmK
— CPL T20 (@CPL) August 18, 2023