మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమితో డీలా పడ్డ టీమిండియా మళ్లీ పుంజుకుంది. భారీ స్కోర్ ముందున్నా.. యువ ఆటగాళ్లు శ్రేయస్-ఇషాన్ జోడి భారత్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించింది. ఒకరు మాస్ ఇన్నింగ్స్‌తో మెరిపిస్తే.. మరొకరు క్లాస్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కారు. వెరసి.. టీమిండియాను ఈ సిరీస్‌లో నిలబెట్టారు. సౌతాఫ్రికాతో ఆదివారం రాంజీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఢిల్లీలో జరిగే చివరి మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. ఈ మ్యాచ్‌లో భారత మిడిల్డార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌తో పాటు పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా 3 వికెట్లతో రాణించాడు.
279 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్ష్ 6వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ శిఖర్ ధావన్(13)ను పార్నెల్ బౌల్డ్ చేశాడు. ఇక 28 పరుగులతో టచ్‌లోకి వచ్చాడనుకున్న మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 9వ ఓవర్ చివరి బంతికి రబాడా బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 48 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్‌తో జత కలిసిన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. శ్రేయస్ బాల్ టూ బాల్ ఇన్నింగ్స్ ఆడినా.. ఇషాన్ కిషన్ ఆరంభంలో టైమ్ తీసుకుని తర్వాత చెలరేగి పోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను టార్గెట్ చేస్తూ.. భారీ సిక్సులు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ ఏకంగా 7 సిక్సులు కొట్టాడు.
కానీ.. దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులతో 93 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. 35వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికే శ్రేయస్‌తో కలిసి 161 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇషాన్ అవుట్ తర్వాత.. శ్రేయస్, సంజు శాంసన్‌తో కలిసి మిగతా పని పూర్తి చేశాడు. ఈ క్రమంలో తన సెంచరీ కూడా పూర్తి చేశాడు. 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లోనే అత్యధిక స్కోర్ సాధించాడు. సంజు శాంసన్ 36 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌండరీతో మ్యాచ్ ముగించి శ్రేయస్ అయ్యర్ కూడా నాటౌట్‌గా నిలిచాడు.
1⃣1⃣3⃣* runs
1⃣1⃣1⃣ balls
1⃣5⃣ foursA game-changing knock from @ShreyasIyer15 as he bags the Player of the Match award! 👏👏#TeamIndia | #INDvSA pic.twitter.com/7kjHzj9MqW
— BCCI (@BCCI) October 9, 2022
Shit by ishan kishan 🔥 pic.twitter.com/CePScsTn3s
— J A G D E E S H🇮🇳 (@rohitian4520) October 9, 2022