భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్‌కొచ్చిన ఫ్రస్టేషన్ సౌతాఫ్రికాకు ఉచితంగా 4 పరుగులను అదనంగా ఇచ్చింది. ఎలా వచ్చినా పరుగులు పరుగులే అన్నట్లు ఏమాత్రం మొహమాటం లేకుండా సౌతాఫ్రికా ఆ ‘ప్రస్టేటేడ్ రన్స్’ను తీసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేడని.. అతను ఉండిఉంటే కచ్చితంగా సిరాజ్ పని అయ్యేదని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో సరిపోయింది కానీ.. ఒక వేళ తక్కువ పరుగులతో ఓడిపోయి ఉంటే.. ఈ పాటికి సిరాజ్‌పై విమర్శల వర్షం కురిసేది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేస్తున్న సిరాజ్.. మొదటి బాల్‌ను డాట్ బాల్‌గా అద్భుతంగా వేశాడు. రెండో బంతి కూడా డాట్ బాల్. స్ట్రైక్‌లో ఉన్న కేశవ్ మహరాజ్‌కు సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం పెద్దసమస్యగా మారింది. డెత్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్.. రెండో బాల్ డాట్ పడిన తర్వాత ఫ్రస్టేషన్‌లో పెద్ద తప్పు చేశాడు. బ్యాటర్ మిస్ అయిన బాల్ కీపర్ సంజు శాంసన్ చేతుల్లో పడింది. ఆ బంతిని సంజు తిరిగి.. బౌలర్ సిరాజ్‌కు అందించాడు. అది తీసుకుని తిరిగి బౌలింగ్ వేసేందుకు వెళ్తున్న సిరాజ్‌కు ఏమైందో ఏమో తెలియదు కానీ.. కోపంగా వికెట్లను బాల్‌తో కొట్టబోయాడు. కానీ.. బంతి వికెట్లను మిస్ అయి బౌండరీ లైన్‌కు చేరింది. అప్పడు బ్యాటర్ క్రీజ్ బయటే ఉన్నాడు. దీంతో రనౌట్ కోసం ప్రయత్నించాడని అంపైర్ బైస్ రూపంలో 4 పరుగులు సౌతాఫ్రికాకు ఇచ్చాడు.
కానీ.. సిరాజ్ రనౌట్ కోసం ప్రయత్నించలేదని.. రెండో బంతికి బ్యాటర్ మిస్ అయినా.. అది ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్లు అనిపించి.. వికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన సిరాజ్ కోపంలో బంతికి విసిరేశాడు. అప్పటికే కీపర్ నుంచి బౌలర్‌కు బాల్ వచ్చేసి అది డెడ్ అయిపోయిందని భావించినట్లు సిరాజ్ కొద్ది సేపు అంపైర్‌తో వాదన కూడా పెట్టుకున్నాడు. కెప్టెన్ ధావన్ కూడా సిరాజ్ వైపే నిలబడ్డాడు. అయినా కూడా అంపైర్ ఒప్పుకోలేదు. బాల్ డెడ్ కాలేదని తాను భావించి బైస్ రూపంలో బౌండరీ ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో ప్రొటీస్‌కు ఫ్రీగా 4 పరుగులు వచ్చాయి. కాగా.. ఇలాంటి పరిస్థితిల్లో కెప్టెన్ ధావన్ సిరాజ్‌ను వెనకేసుకోచ్చాడు కానీ.. రోహిత్ శర్మ ఉండిఉంటే.. సిరాజ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా పేర్కొంటున్నారు. కానీ.. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఈ చిన్న తప్పుచేసినా.. అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో సౌతాఫ్రికాను పరుగులు చేయనియలేదు. 10 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక ఓవర్ మెయిడెన్ కూడా ఉంది.
— CricTracker (@Cricketracker) October 9, 2022
ఇది కూడా చదవండి: Ben Stokes: క్రికెటర్ స్టోక్స్ కి కొద్దిలో ప్రమాదం మిస్.. దెబ్బకి ఎగిరి పడ్డాడు!