పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాడు ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులున్నారని, పాకిస్తాన్ లో కూడా ఆయనకు అభిమానులున్నారని తెలిపారు. ఆయన బ్యాటింగ్ స్టైల్ బాగుంటుందని అందుకే అతడిని అందరూ ఇష్టపడతారని అన్నాడు. కానీ కోహ్లీని మించిన ఆటగాడు టీమిండియలో మరోకరు ఉన్నారని అక్తర్ మనసులో మాట బయటపెట్టాడు.
ఇక కోహ్లీ కంటే ముందుగా రోహిత్ శర్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని, అతడి ఆట తీరును చాలా మంది ఇష్టపడతారని తెలిపాడు. అక్టోబర్ 24 న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య టి 20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైన కామెంట్స్ చేశారు. ఇక అక్తర్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో చాలా వైరల్ మారుతున్నాయి. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.