Pepsi Cup 1999, India vs Pakistan: భారత్, పాకిస్తాన్ సమారానికి మరో పది రోజులు మాత్రమే సమయముంది. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీలో ఆగస్టు 28న ఇరు జట్లు తలపడనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం మళ్లీ ఇన్నాళ్లకు దాయాదీ దేశాలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ షోలో పాల్గొన్న అక్తర్.. 1999లో జరిగిన ఒక సంఘటనను బయటపెట్టాడు.
స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ షోలో పాల్గొన్న అక్తర్.. తమ హయాంలో భారత్-పాక్ తలపడినప్పుడు ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని గాయపర్చాలనే లక్ష్యంతోనే 1999లో తాను బౌలింగ్ చేసినట్లు అక్తర్ తాజాగా అంగీకరించాడు. 1999లో మొహాలీ వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ తీవ్రంగా గాయపడ్డాడు. అక్తర్ వేసిన షార్ట్ పిచ్ బాల్(గంటకు 150కిమీపైనే).. అతని పక్కటెముకలకు బలంగా తాకింది. దాంతో మైదానంలో కుప్పకూలిన గంగూలీ.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ మ్యాచ్‌కు ముందు జరిగిన టీం మీటింగ్ లో భారత ఆటగాళ్లు గాయపడేలా బౌలింగ్ చేయాలని తనకు సూచించారని అక్తర్ తెలిపాడు.
“నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా బ్యాటర్ హెడ్ లేదా రిబ్స్‌ని టార్గెట్‌గా చేసుకునేవాడ్ని. మొహాలి మ్యాచ్‌లో గంగూలీ టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయంపై టీం మీటింగ్‌లోనూ చర్చ జరిగింది. నేను గాయపరచాలి అంతేనా? ఔట్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగాను. దానికి అందరూ మొదట నువ్ గాయపరుచు. ఔట్ సంగతి మేము చూసుకుంటాం అని చెప్పారు” అని అక్తర్ వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత సౌరవ్ గంగూలీకి ఈ విషయాన్ని తాను ఒకసారి స్వయంగా చెప్పినట్లు కూడా అక్తర్ గుర్తు చేసుకున్నాడు.
ఇక, ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 196 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. పాకిస్తాన్ జట్టు 42 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అనంతరం ఫైనల్ లో భారత్, పాక్ మరోసారి తలపడగా.. 123 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలవుతుంది. ఏదేమైనా.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ లో ఇలా ముందుగానే ఒక ప్లేయర్ గాయపరచాలనుకోవడం కరెక్టేనా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sachin Tendulkar: షాహిద్ ఆఫ్రిది పదే పదే తిడుతుంటే.. సచిన్ ఏం చేశాడంటే: సెహ్వాగ్
ఇదీ చదవండి: గంగూలీ కాదు.. అతను చెప్పడం వల్లే నేను ఓపెనర్‌గా మారా: వీరేంద్ర సెహ్వాగ్