వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు టగెనరైన్ చంద్రపాల్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వేతో బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టగెనరైన్ సెంచరీ బాదేశాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో శివనారాయణ్ చంద్రపాల్ గ్రేటెస్ట్ బ్యాటర్‌గా పేరొందాడు. ఇప్పుడు అతని కుమారుడు సైతం తండ్రి అడుగుజాడల్లోనే మంచి టెస్టు క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. 26 ఏళ్ల టెగెనరైన్ ఇప్పటి వరకు 3 టెస్టు మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాయంతో 66.25 సగటుతో 261 పరుగులు చేశాడు. తాజాగా జింబాబ్వేకు జరుగుతున్న టెస్టులో 116 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్నర్ బ్రాత్‌వైట్‌తో కలిసి 200 పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టగెనరైన చంద్రపాల్ సెంచరీ చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో శివనారాయణ్ చంద్రపాల్-టగెనరైన్ చంద్రపాల్ చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్ తరఫున టెస్టు సెంచరీ చేసిన తొలి తండ్రీకొడుకులుగా వీళ్లిద్దరూ నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి జోడీలు చాలానే ఉన్నా.. వెస్టిండీస్ చరిత్రలో ఇదే తొలి సారి. 1994 నుంచి 2015 వరకు వెస్టిండీస్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన చంద్రపాల్ ఖాతాలో ఏకంగా 30 టెస్టు సెంచరీలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వెస్టిండీస్ తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన టగెనరైన్ చంద్రపాల్.. తన మూడో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు.
1994లో వెస్టిండీస్ జట్టులోకి అడుగుపెట్టిన శివనారాయణ్ చంద్రపాల్ 164 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 11,867 పరుగులు సాధించాడు. అందులో 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 268 వన్డేల్లో 8778 పరుగులు 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వెస్టిండీస్ తరఫున 22 టీ20లు సైతం ఆడిన చంద్రపాల్ 343 పరుగులు చేశాడు. ఇక చంద్రపాల్ అతని కుమారుడిలా టెస్టు సెంచరీలు చేసిన తండ్రీకొడుకులు మన ఇండియా తరఫున మూడు జోడీలు ఉన్నాయి. లాలా-మొహిందర్ అమర్‌నాథ్ (ఇండియా) ఇఫ్తికార్-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(ఇండియా).. ఇఫ్తికార్ బ్రిటిష్ ఇండియా కాలంలో ఇంగ్లండ్‌కు ఆడి సెంచరీ చేశారు. విజయ్-సంజయ్ మంజ్రేకర్ (ఇండియా) వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా టెస్టు క్రికెట్‌లో సెంచరీలు చేసిన తండ్రీకొడుకులు ఎవరో తెలుసుకుందాం.. క్రిస్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), హనీఫ్-షోయబ్ మహ్మద్ (పాకిస్థాన్), వాల్టర్-రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), జియోఫ్-షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా), నాసర్-ముదస్సర్ (పాకిస్థాన్), కెన్-హమిష్ రూథర్‌ఫోర్డ్ (న్యూజిలాండ్), డేవ్-డడ్లీ నర్స్ (దక్షిణాఫ్రికా), రాడ్-టామ్ లాథన్ (న్యూజిలాండ్). మరి ఇప్పుడు శివనారాయణ్ చంద్రపాల్-టగెనరైన్ చంద్రపాల్ నెలకొల్పిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
West Indies opener Tagenarine Chanderpaul slammed Maiden Test 💯 in his 3rd Test match 👏
Tagenarine and Shivnarine Chanderpaul becomes the 10th father and son duo to score a Test century & 1st from West Indies
📷: AP/ICC #TestCricket #ZIMvWI #CricketTwitter pic.twitter.com/UBaI0RqtiX
— Niche Sports (@Niche_Sports) February 5, 2023