'పాకిస్తాన్', 'పాకిస్తాన్ క్రికెట్ టీం'.. నిత్యం వార్తల్లో నిలిచే రెండు పేర్లు. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా దేశం వార్తల్లో నిలుస్తుంటే, వ్యక్తిగత విమర్శలతో పాక్ క్రికెట్ జట్టు వార్తల్లో ఉంటోంది. ప్రస్తుత పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాంను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తుండటం, సహచర ఆటగాళ్లు అందుకు ససేమిరా అంటుండటం రోజుకో వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాన్ మసూద్.." బాబర్ ఆజాం కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ బాంబ్ పేల్చాడు.
పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాంపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సారథిగా మాత్రం జట్టును విజయపథంలో నడిపించలేకతున్నాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ చేతిలో పాక్ ఓడిన నాటి నుంచి ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆపై స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల చేతిలో పాక్ ఓటమిపాలవడంతో కష్టాలు అతన్ని మరింత చుట్టిముట్టాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ నుంచి తప్పించాలంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేశ మాజీ ఆటగాళ్లు దీనినే ఒక పనిగా ఎంచుకొని విమర్శణాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
టీ20లలో బాబర్ ఆజాం ఆడే ఆట.. టెస్టుల కంటే అధ్వాన్నంగా ఉందని పాక్ మాజీ క్రికెటర్లు అతడిపై మండి పడుతున్నారు. ఏదో ఒక మ్యాచులో 130కి పైగా స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నా, మిగిలిన అన్ని మ్యాచుల్లో అతడి స్ట్రైక్ రేట్ 110 దాటట్లేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుని.. సుదీర్ఘ ఫార్మాట్ మీద దృష్టి పెట్టాలని, పొట్టి ఫార్మాట్ కు మరో కెప్టెన్ ను నియమించాలని సూచిస్తున్నారు. గతంలో ఇదే విషయం చర్చికు రాగా, టీ20 సారధిగా షాన్ మసూద్ ను నియమించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాలేదు. ఆపై అనూహ్యంగా షాన్ మసూద్ వన్డే ఫార్మాట్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడంతో మరోసారి ఆ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో షాన్ మసూద్ స్పందించాడు.
బాబర్ కు మద్దతుగా నిలిచిన మసూద్, అతడంటే అంటే తమకు ప్రాణమని.. అతడి కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. “మా అందరి కామన్ గోల్ దేశం గర్వపడేలా ఆడటం. ఈ క్రమంలో మేం చాలా న్యూస్ వింటున్నాం. మా జట్టు గురించి పాక్ నుంచే పలువురు వారికి నచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన జట్టును తక్కువగా చేసి మాట్లడకూడదు. వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. గతంలో సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా ఉండి.. ఇలాంటి సమస్యలు పేస్ చేసినపుడు అతని కోసం మేం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డాం. ఇప్పడు బాబర్ విషయంలో కూడా అదే పని చేసేందుకు సిద్ధమయ్యాం. మాలో మాకు ఎవరితో ఎవరికీ సమస్యల్లేవు. దేశం కోసం అత్యుత్తమంగా ఆడటమే మా అందరి లక్ష్యం. అదే మమ్మల్ని ఐక్యంగా ఉంచుతుంది..” అని మసూద్ తెలిపాడు. మసూద్ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ మాజీ క్రికెటర్లను, ప్రస్తుత ఆటగాళ్లను రెండుగా చీలుస్తున్నాయి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shan Masood talked about his team’s dedication and admiration towards Pakistan skipper Babar Azam 🙌#PakistanCricket #BabarAzam pic.twitter.com/Z2LE99gZoS
— Cricket Pakistan (@cricketpakcompk) March 5, 2023
“I have Blind trust in my Skipper”
– M.Rizwan
“We can Sacrifice our lives for Babar”
– Shan Masood
“Criticizing Babar is a Sin”
– Iftikhar Ahmed
“Babar Azam is Bigger than Koh-e-Noor”
– Shadab Khan
“Babar Azam is the Number 1 Player”
– Shaheen #BabarAzam… https://t.co/hhm5sTUMTn pic.twitter.com/YVLPp4GOus— King Babar Azam Army (@kingbabararmy) March 6, 2023