'పాకిస్తాన్', 'పాకిస్తాన్ క్రికెట్ టీం'.. నిత్యం వార్తల్లో నిలిచే రెండు పేర్లు. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా దేశం వార్తల్లో నిలుస్తుంటే, వ్యక్తిగత విమర్శలతో పాక్ క్రికెట్ జట్టు వార్తల్లో ఉంటోంది. ప్రస్తుత పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాంను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తుండటం, సహచర ఆటగాళ్లు అందుకు ససేమిరా అంటుండటం రోజుకో వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాన్ మసూద్.." బాబర్ ఆజాం కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ బాంబ్ పేల్చాడు.
అంచనాలకు అందని జట్టుగా పాకిస్థాన్‌కు పేరుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక రోజు ఛాంపియన్ టీమ్‌లా ఆడే పాక్.. మరోసటి మ్యాచ్‌లో పసికూన కంటే దారుణ ప్రదర్శన ఇస్తుంది. ఇలా ఆటలో నిలకడలేమికి మారుపేరుగా ఉన్న పాకిస్థాన్.. కీలక నిర్ణయాల్లోనూ ఎవరీ అంచనాలకు అందడం లేదు. ఒక స్టార్ ప్లేయర్‌కు టీమ్‌లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి.. అతనికి జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు ఇవ్వలేదు. ఇంత కంటే దారుణమైన నిర్ణయం మరొకటి […]
టీమిండియా మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు షాక్‌లోకి వెళ్లింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు షాన్ మసూద్ ప్రాక్టీస్‌లో కుప్పకూలిపోయాడు. మరో స్టార్ బ్యాటర్ నవాజ్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి వెళ్లి మసూద్‌ను తల వెనుక భాగంగా బలంగా తాకింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పకూలాడు. 10 నిమిషాలతో నొప్పితో విలవిలలాడటంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఊహించని ప్రమాదంతో పాకిస్థాన్ టీమ్‌లో ఒకలాంటి నిశబ్ధం అలుముకుంది. బ్యాటింగ్ చేసిన నవాజ్.. […]