సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. కొందరు ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగితే.. మరికొన్ని సార్లు తమ జట్టులోని ఆటగాళ్లపైకే యుద్ధానికి దిగుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో సందర్భంగా ఫార్చ్యూన్ బారిషల్స్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో షకీబ్ అల్ హసన్ కోపంతో అంపైర్ పైకి దూసుకెళ్లాడు. బ్యాట్ తో సహా అంపైర్ దగ్గరికి వెళ్లాడు. దాదాపు అతడిని కొట్టేంత పని చేశాడు షకీబ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
షకీబ్ అల్ హసన్.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడిగా మంచి గుర్తింపు పొందాడు. పైగా వరల్డ్ క్రికెట్ పై అత్యున్నత ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా షకీబ్ ఊరికే అసహనానికి లోనౌతున్నాడు. గతంలో వికెట్లను తన్ని వార్తల్లోకి ఎక్కిన షకీబ్.. తాజాగా అంపైర్ పైకి బ్యాట్ తో దూసుకెళ్లి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బరిషల్ తరపున బరిలోకి దిగాడు షకీబ్. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఓ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఓవర్లో 4వ బంతిని బౌలర్ రహ్మన్ రజా బౌన్సర్ గా వేశాడు. ఆ బంతి కాస్త షకీబ్ తలపై నుంచి వెళ్లడంతో.. అంపైర్లు వైడ్ ఇస్తారని అనుకున్నాడు. కానీ లెగ్ అంపైర్ కాస్త బౌలర్ కు ఫస్ట్ వార్నింగ్ అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో షకీబ్ కు చిర్రెత్తుకొచ్చింది. అంపైర్ పై అరుస్తు.. అతడి వైపు కోపంతో దూసుకెళ్లా. వైడ్ ఎందుకు ఇవ్వలేదు అని వాగ్వాదానికి దిగాడు. అంపైర్ అతడికి సర్ధి చెప్పడంతో తిరిగి క్రీజ్ లోకి వచ్చాడు షకీబ్. ప్రస్తుతం షకీబ్ అంపైర్ పైకి దూసుకెళ్లిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరిషల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లుకు 194 పరుగుల భారీ స్కోరు చేసింది. 32 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లతో షకీబ్ 67 పరుగులు చేశాడు. అనంతరం స్ట్రైకర్స్ జట్టు 19 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Shakib wasn’t happy this wasn’t called a wide 👀#BPL2023 pic.twitter.com/oNe5Kh8SYJ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2023