ప్రస్తుత వన్డే క్రికెట్ లో ఎన్నో రికార్డులను సెట్ చేసాడు విరాట్ కోహ్లీ. బాబర్ అజామ్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే వీరిద్దరికి షాకిస్తూ ఒక ప్లేయర్ తానే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్?
ప్రస్తుతం వన్డే క్రికెట్ లో టాప్ బ్యాటర్ ఎవరూ అంటే ఠక్కున విరాట్ కోహ్లీ పేరు చెప్పేస్తారు. ఇక కొంతమంది అయితే బాబర్ అజాం అని చెప్పుకొస్తారు . వీరిద్దరి వన్డే రికార్డ్ చూసుకుంటే నమ్మశక్యం కానీ రీతిలో ఉంటాయి. వన్డేల్లో 50 యావరేజ్ కష్టమన్న తరుణంలో వీరిద్దరి సగటు ఏకంగా 60 ఉండడం విశేషం. విరాట్ కోహ్లీ కొత్త రికార్డులను సెట్ చేస్తుంటే బాబర్ అజామ్ వాటిని బ్రేక్ చేస్తూ వెళ్తున్నాడు. ఇక స్టీవ్ స్మిత్, రూట్, విలియంసన్ వీరికి పోటీనిచ్చినా..వారి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఈ దశలో వన్డేల్లో వీరిద్దరికీ షాకిస్తూ ఒక ప్లేయర్ తానే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్?
క్రికెట్ అంటే తక్కువగా క్రేజ్ ఉండే దేశాల్లో వెస్టిండీస్ ఒకటి. వీరి బోర్డు ఆటగాళ్లకు చాలా తక్కువగా ఫీజు చెలిస్తుంది. ఆ కారణంగానే విండీస్ ప్లేయర్లు డబ్బు కోసం దేశం కోసం కాకుండా అంతర్జాతీయ లీగ్ లు ఆడుకుంటున్నారు. ఈ దశలో ఒక ప్లేయర్ దేశం కోసం ఆడుతూ వన్డేల్లో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అతడెవరో కాదు ప్రస్తుత విండీస్ గ్రేట్ బ్యాటర్ హోప్. ఇతడి గురించి ప్రపంచ క్రికెట్ కి పెద్దగా తెలియకపోవచ్చు గాని ఇతడి వన్డే రికార్డులు చూస్తే షాకవ్వాల్సిందే. కెరీర్ ప్రారంభం నుంచి మంచి ఫామ్ లో ఉన్న హోప్.. గత నాలుగేళ్లలో భీకర ఫామ్ లో ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే కోహ్లీ, బాబర్ అజామ్ కన్నా.. హోప్ ఎక్కువగా పరుగులు చేయడం విశేషం.
గత నాలుగేళ్లలో 46 ఇన్నింగ్స్ లో హోప్ ఏకంగా 2021పరుగులు చేసాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ 37 ఇన్నింగ్స్ లో 1612పరుగులు చేస్తే.. బాబర్ 28 ఇన్నింగ్స్ లో 1876 పరుగులు చేసాడు. హోప్ మంచి ఫామ్ లో ఉన్నా అండరేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులు ఆడుతున్న విండీస్ జట్టు నిన్న యూఏఈ మీద జరిగిన మ్యాచులో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచులో హోప్ 54 పరుగులతో రాణించాడు. మరి చివరి నాలుగేళ్లలో వన్డే క్రికెట్లో కోహ్లీని, బాబర్ అజామ్ ని హోప్ దాటేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.