టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ టీమ్ దృష్టిపెట్టాల్సిన పలు అంశాలపై పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ స్పందించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న లోటుపాట్లు గురించి తన అభిప్రాయాలను కాస్తగట్టినే వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టులో ముఖ్యంగా మిడిల్డార్‌లో నిలకడగా ఆడే ఆటగాడు లేడని అన్నాడు. టీమిండియా హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ పాకిస్థాన్ జట్టులో లేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాదాబ్, ఆసీఫ్ అలీ, ఖుష్‌దిల్ షా లాంటి ఆటగాళ్లు ఉన్నా.. వారి నిలకడలేమి సమస్యగా మారిందని, అలాగే వారి ఫినిషింగ్ స్కిల్స్ అంతగొప్పగా ఏమీ లేవని కూడా అఫ్రిదీ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ప్రస్తుత పాకిస్థాన్ టీమ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లాంటి ఫినిషర్ లేరా అని అఫ్రిదీకి ఎదురైన ప్రశ్నకు అతను అవునంటూ బదులిచ్చాడు. స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌తో సహా పాక్ క్రికెటర్లలో కన్సిస్టెన్సీ లేదని అన్నాడు. ‘హార్దిక్ లాంటి ఫినిషర్ మనకు లేడు. ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా నుంచి ఫినిషింగ్ ఆశిస్తే.. వాళ్లు అంతగా రాణించట్లేదు. నవాజ్ కూడా నిలకడగా ఆడటంలేదు. షాదాబ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ నలుగురిలో కనీసం ఏ ఇద్దరైన నిలకడ కనబర్చాలి.’ అని అఫ్రిది పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న 7 టీ20ల సిరీస్‌లో 2-2తో సమంగా ఉంది.
కాగా ఐపీఎల్ 2022కి ముందు పూర్‌ఫామ్, గాయాలతో టీమిండియాలో చోటు కోల్పోయిన హార్దిక్ పాండా.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ఐపీఎల్ 2022లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌ను కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించి విజేతగా నిలపడంతో పాటు ఆల్‌రౌండర్ తను కూడా ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2022లో చూపిన అద్భుత ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చిన పాండ్యా.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసియా కప్ 2022లో 50 పరుగులు మాత్రమే చేసినా.. గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్‌పై 17బంతుల్లో 33పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఇటివల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లోనూ పాండ్యా పర్వాలేదనిపించాడు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో కీలక 25 పరుగులు చేసి విజయలాంఛనాన్ని ముగించాడు.
🗣️ Pakistan need an all-rounder like Hardik Pandya
Do you agree with Shahid Afridi’s statement❓#PAKvENG #T20WorldCup #CricketTwitter pic.twitter.com/lqu896OqkS
— CricWick (@CricWick) September 28, 2022
ఇది కూడా చదవండి: ధోనీ వల్లే ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ నాశనమైందా? ఇర్ఫాన్ ట్వీట్ వెనుక ఆంతర్యమేంటి?