భారత్- పాకిస్థాన్ ల క్రికెట్ జట్లకు గత కొన్ని నెలలుగా అస్సలు రాజీ కుదరడం లేదు. పాకిస్థాన్ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి బీసీసీఐకి అస్సలు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రిది స్పందిస్తూ పాకిస్థాన్ ని భారత్ కి పంపాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
భారత్- పాకిస్థాన్ ల క్రికెట్ జట్లకు గత కొన్ని నెలలుగా అస్సలు రాజీ కుదరడం లేదు. ఆసియా కప్ నుంచి మొదలైన ఈ వార్ ఇప్పుడు వరల్డ్ కప్ వరకు వెళ్ళింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న ఆసియా కప్ – 2023 ఆడేందుకు పాకిస్తాన్ కు వచ్చే ప్రసక్తే లేదని ఇదివరకే బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో భారత్ తో పాకిస్థాన్ ఆడబోయే మ్యాచులకి తటస్థ వేదికలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను కూడా తిరస్కరించింది. భారత్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ లు కూడా భారత్ కు మద్దతు తెలపడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చిక్కుల్లో పడినట్లుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్ లో పాల్గొనమని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఈ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసాడు.
భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ వరల్డ్ కప్ కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఎప్పుడో రద్దయ్యాయి. ఇక ఇటీవలే ఈ ద్వైపాక్షిక సిరీస్ ల కోసం తటస్థ వేదికలు నిర్వహించాలని పీసీబీ, బోర్డు అధ్యక్షుడు నజమ్ సేథీ ప్రతిపాదించగా.. బీసీసీఐ దానిని తిరస్కరించింది. కనీసం వీరిద్దరినీ ఆసియా కప్ లో ఐసీసీ టోర్నీలో చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు అది జరిగేలా వీలు పడడం లేదు. పాకిస్థాన్ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి బీసీసీఐకి అస్సలు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రిది ఈ విషయంలో స్పందిస్తూ పాకిస్థాన్ ని భారత్ కి పంపాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
ఆఫ్రిది మాట్లాడుతూ.. ” వన్డే వరల్డ్ కప్ లో ఆడేదీ లేదని, తాము భారత్ కు వెళ్లబోమని పీసీబీ ఎందుకు చెబుతుందో నాకు అర్థం కావడం లేదు. వాళ్లు పరిస్థితులను సరళీకరించుకోవాలి. పాక్ ఆడకున్నా ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయంలో సానుకూలంగా ఉండటం చాలా అవసరం. భారత్‌కు వెళ్లి వన్డే వరల్డ్ కప్ ఆడండి. మీ క్రికెటర్లకు ట్రోఫీని గెలవమని చెప్పండి. దేశం మొత్తం మీకు అండగా ఉంటుంది. ఒకవేళ భారత్ కు వెళ్లి అక్కడ పాకిస్తాన్ ట్రోఫీ నెగ్గితే అది మనకు పెద్ద విజయమే కాదు.. బీసీసీఐ చెంప ఛెల్లుమనిపించినట్టే అవుతుంది..’ అని ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. మరి ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.