ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా వెనకపడి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లమీద ఆడలేని బలహీనతని మరోసారి బయటపెట్టింది. 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం గ్రీజ్ లో సీనియర్ బ్యాటర్ రహానే (29), భరత్ (5) ఉన్నారు. వీరిద్దరి పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో ఆసీస్ పేసర్ వేసిన ఒక బంతికి క్రికెట్ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఆట ముగిసింది. మొదట బౌలర్లు పుంజుకొని ఆసీస్ ని బాగానే కట్టడి చేసి 500 మార్క్ టచ్ చేయకుండా ఆపడంలో సఫలమయ్యారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకే ఆలౌటైంది. స్మిత్ సెంచరీ పూర్తి చేసుకోగా ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు దక్కగా.. షమీ, శార్ధూల్ కి చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం గ్రీజ్ లో సీనియర్ బ్యాటర్ రహానే (29), భరత్ (5) ఉన్నారు. వీరిద్దరి పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో ఆసీస్ పేసర్ వేసిన ఒక బంతికి క్రికెట్ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా వెనకపడి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లమీద ఆడలేని బలహీనతని మరోసారి బయటపెట్టింది. రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌటయ్యాక భారత్ తొలి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. తొలి 5 ఓవర్లలోనే ఓపెనర్లు ఇద్దరు ఫోర్లు కొడుతూ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. కమ్మిన్స్ ఎప్పుడైతే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీసాడో ఇక అప్పటి నుంచి వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. స్కాట్ బోలాండ్ ఒక అద్భుత బంతితో ఫామ్‌లో ఉన్నశుభ్‌మన్ గిల్(13) బౌల్డ్ చేశాడు. నిన్న జరిగిన మ్యాచులో గిల్ ఔటైన బంతి హైలెట్ గా నిలిచింది. బోలాండ్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి బౌల్డ్ అయిన గిల్‌కు ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియలేదు. ఆ బంతి వికెట్ల వైపు రాదు అనుకున్న అతడు దానిని వదిలేశాడు.
అయితే గిల్ అంచనా తప్పింది. అనూహ్యంగా టర్న్ అయిన బాల్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో, బోలాండ్ సహా ఆసీస్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్ మొత్తానికి ఆ బంతిని క్రికెట్ ఆస్ట్రేలియా ‘మాస్టర్‌పీస్’గా అభివర్ణించింది. బోలాండ్ వేసిన ఆ డెలివరీ ఎంతంగా టర్న్ అయిందో తెలిపే ఫొటోను ట్విట్టర్‌లో పెట్టింది. బోలాండ్ వేసిన ఈ బంతికి ఫామ్ లో ఉన్న శుభమాన్ గిల్ ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. కాసేపటికీ పుజారా కూడా ఇదే తరహాలో ఆడడం గమనార్హం. మొత్తానికి బోలను వేసిన ఇన్ స్విన్గర్ బంతి మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Masterpiece 👌#WTCFinal pic.twitter.com/6skbxI48P6
— cricket.com.au (@cricketcomau) June 8, 2023