తాజాగా శనివారం(ఏప్రిల్ 8)న రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అచ్చం ధోని స్టైల్లో ఈ క్యాచ్ ను అందుకుని పృథ్వీ షాను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం సంజూ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడిపోతూ.. ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ.. ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇక తాజాగా శనివారం(ఏప్రిల్ 8)న రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అచ్చం ధోని స్టైల్లో ఈ క్యాచ్ ను అందుకుని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన పృథ్వీ షాను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం సంజూ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సంజూ శాంసన్.. గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. జట్టులో చోటు కోసం పడరానిపాట్లు పడుతున్నాడు సంజూ శాంసన్. ఈ క్రమంలోనే కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోయాడు సంజూ. ఇక ప్రస్తుతం సంజూ జట్టులోకి రావాలి అంటే ఈ ఐపీఎలో కచ్చితంగా రాణించాలి. అయితే తన పూర్ ఫామ్ ను అలానే కొనసాగిస్తున్నాడు సంజూ శాంసన్. ఆడిన మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్ కే అవుటై అభిమానులను మళ్లీ మళ్లీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయిన శాంసన్.. కీపింగ్ లో మాత్రం మెరిశాడు. తొలి ఓవర్ లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాను అద్భుతమైన క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్ లో 3వ బంతి ఎడ్జ్ తీసుకుని స్లీప్ వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే చిరుతపులిలా దూకి ఒక్క చేత్తో క్యాచ్ ను ఒడిసిపట్టుకున్నాడు సంజూ భాయ్. దాంతో ఈ క్యాచ్ చూసిన అభిమానులు అచ్చం ధోనిలా పట్టావ్ సంజూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే సంజూను జట్టులోకి తీసుకోవాలి అని అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా గానీ కీపింగ్ లో శాంసన్ సూపర్ హిట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఈ క్యాచ్ వీడియో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్స్ తో 60 పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్స్ తో 79 పరుగులు చేశాడు. చివర్లో హెట్మైయర్ 21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్ లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లలకు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ వార్నర్(54) పరుగులతో ఉన్నాడు.
Captain Sanju Samson with a magnificent catch. pic.twitter.com/HSVmiaCKAj
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023